జర్నలిస్టు ముసుగులో గూఢచర్యం.. మరో ఇద్దరి అరెస్ట్

ABN , First Publish Date - 2020-09-20T02:57:14+05:30 IST

జర్నలిస్టు ముసుగులో గూఢచర్యానికి పాల్పడుతూ భారత రహస్యాలను చైనాకు చేరవేస్తున్న ఆరోపణలపై రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్

జర్నలిస్టు ముసుగులో గూఢచర్యం.. మరో ఇద్దరి అరెస్ట్

న్యూఢిల్లీ: జర్నలిస్టు ముసుగులో గూఢచర్యానికి పాల్పడుతూ భారత రహస్యాలను చైనాకు చేరవేస్తున్న ఆరోపణలపై రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. రక్షణ రంగానికి చెందిన కీలక పత్రాలు కలిగివున్నాడన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. భారత రహస్యాలను చేరవేస్తున్నందుకు ప్రతిఫలంగా అతడు భారీ మొత్తంలో డబ్బు పొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. షెల్ కంపెనీల ద్వారా అతడికి చెల్లింపులు జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు అతడికి డబ్బులు చెల్లిస్తున్న ఓ మహిళతోపాటు నేపాల్‌కు చెందిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.  


నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. నిందితులకు కోర్టు ఆరు రోజుల పోలీసు కస్టడీ విధించినట్టు చెప్పారు. 


కాగా, రాజీవ్‌శర్మ గతంలో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ద ట్రిబ్యూన్, సకాల్ టైమ్స్ పత్రికల్లో పనిచేశాడు. చైనాకు చెందిన ‘గ్లోబల్ టైమ్స్’కు ఇటీవల ఓ వ్యాసం కూడా రాశాడు.  

Updated Date - 2020-09-20T02:57:14+05:30 IST