దేశభక్తిని పెంపోందించేందుకే ‘ఫ్రీడమ్‌ రన్‌’

ABN , First Publish Date - 2022-08-12T06:00:01+05:30 IST

యువతలో దేశభక్తిని, ఐక్యతను పెంపొం దించేందుకే ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్‌ రవి అన్నారు.

దేశభక్తిని పెంపోందించేందుకే ‘ఫ్రీడమ్‌ రన్‌’
ఫ్రీడం రన్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌ పర్సన్‌

కలెక్టర్‌ రవి

జగిత్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, జడ్పీ అధ్యక్షురాలు, ఎస్పీ

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 11: యువతలో దేశభక్తిని, ఐక్యతను పెంపొం దించేందుకే ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్‌ రవి అన్నారు. స్వా తంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో గురువారం ఫ్రీ డం రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీ స్టేడియం నుంచి కొత్త బ స్టాండ్‌ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ రవి, ఎస్పీ సిం ధుశర్మ, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, అ దనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీలతో పాటు పలువురు హుషారు గా పాల్గొన్నారు. చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని యువత రన్‌లో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. అనంతరం ఫ్రీడం రన్‌లో పాల్గొని మొదటి మూ డు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు దావ వసం త లు మాట్లాడుతూ నేటి సమాజం ధృడంగా ఉండాలంటే యువత ముం దుండాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం రావడానికి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కష్టపడి ప్రాణత్యాగం చేశారని వారిని స్మరించుకుంటూ చిన్నవారి నుంచిపెద్దల వరకు ఈ ఫ్రీడం ర్యాలీ నిర్వహించడం రేపటి త రానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాష్‌, ఇన్‌ చార్జి జడ్పీ సీఈవో రామానుజచార్యులు, సంక్షేమాధికారి నరేష్‌, జిల్లా వైద్యా ధికారి శ్రీధర్‌, డీపీవో నరేష్‌, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, డీఆర్‌ డీవో వినోద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూప రాణి ఉన్నారు.

ధర్మపురిలో ఫ్రీడమ్‌ రన్‌ విజయవంతం 

ధర్మపురి: పట్టణంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ రన్‌ కార్యక్ర మా న్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ సంగి సత్యమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ కలిసి జెండా ఊపి ప్రా రంభిం చారు. సీఐ బిళ్ల కోటేశ్వర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికా రులు మాట్లాడుతూ దేశభక్తిని చాటి చెప్పడానికి, స్వాతంత్య్ర స మరయో ధుల త్యాగాలను కీర్తించడం కోసం ఫ్రీడమ్‌ రన్‌ను ఏర్పాటు చేసి నట్లు ఆయన తెలిపారు. 2 కే రన్‌ విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమ తులు అందించారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని దేశభక్తి చాటారు. ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్‌ అయ్యో రు రాజేష్‌కుమార్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌, తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, డిప్యూటీ డీఎం హెచ్‌వో శ్రీనివాస్‌, ఎంఈవో భూమయ్య,  పాల్గొన్నారు

కోరుట్లలో..పాల్గొన్న విద్యార్థులు, అధికారులు

కోరుట్ల: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలో భాగంగా గురువారం పోలీసు లు, మున్సిపల్‌ అధికారులు ఆధ్వర్యంలోని నిర్వహించిన 2 కే రన్‌ విజయ వంతంగా జరిగింది. పట్టణంలోని సాయిబాబ దేవాలయం వద్ద అదికారు లు 2కే రన్‌ను ప్రారంభించారు. మొదట డోలు కళాకారులు జాతీయ జెం డాలతో పలు విన్యాసాలు ప్రదర్శించంగా ఆహ్వానితులను అలరింపజేసా యి. 2కే రన్‌ను కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ అ యాజ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ గడ్డమీది పవన్‌, ఎంపీపీ తోట నారా యణ జెండా ఊపి ప్రారంభించారు. రన్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పో లీసులు, మున్సిపల్‌ అధికారులు మెడల్స్‌న్‌ ప్రదానం చేసి అభినందించారు. పట్టణంలోని నంది చౌరస్తా వద్ద జాతయ జెండాను విద్యార్థులు ప్రదర్శిం చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు లు బారీ బందో బస్తును నిర్వహించారు. అదే విధంగా పట్టణంలోని పలు వార్డులలో కౌన్సిలర్లు జాతీయ జెండాలను ఇంటింటికీ పంపిణీ చేసి జాతీ యతను చాటారు. పట్టణంలోని బీజేపీ కౌన్సిలర్లు అజాదికి మహోత్సవ కా ర్యక్రమంలో భాగంగా ఇంటింటికీ జాతీయ జెండాలను అందించి వేడు కలలో పాల్గొన్నాలని కొరారు.

మెట్‌పల్లిలో.. 

మెట్‌పల్లి : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలో ఉదయం అధికారులు, ప్రజాప్రతినిధులు ఫ్రీడం రన్‌ను సంబరంగా నిర్వ హించారు. ఆర్డీవో వినోద్‌కుమార్‌ జాతీయ జెండాను ఊపి ఫ్రీడం రన్‌ను ప్రారంభించారు. ఫ్రీడం రన్‌లో ఉత్సవంగా పాల్గొన్న విద్యార్థులకు, మహి ళలలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ర వీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సత్యనారాయణ, పోలీసులు, ప్రజప్రతినిధులు, అఽధి కారులు పాల్గొన్నారు. 

రాయికల్‌లో 

రాయికల్‌లో: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాయికల్‌ ప ట్టణంలో ఫ్రీడం రన్‌ను నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాం డ్లు, జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి, తహసీల్ధార్‌ దిలీప్‌ నాయక్‌, ఎస్సై కిరణ్‌, ఎంపీడీవో సంతోష్‌ కుమార్‌లు చేతిలో జాతీ య జెండాలు పట్టుకుని పట్టణంలోని పలువీధుల గుండా ర్యాలీ నిర్వహిం చారు. పట్టణంలోని యువతీ, యువకులు ఫ్రీడం రన్‌లో హుషారుగా పాల్గొని తమ దేఽశభక్తిని చాటారు.


Updated Date - 2022-08-12T06:00:01+05:30 IST