స్వాత్రంత్య్ర స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-12T06:07:41+05:30 IST

స్వాత్రంత్య్ర స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో

స్వాత్రంత్య్ర స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవాలు
ఫ్రీడమ్‌ రన్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి


ఎల్‌బీనగర్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): స్వాత్రంత్య్ర స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా రాచకొండ పోలీసులు నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌ను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మంత్రి ప్రారంభించారు. అంతకుముందు స్టేడియం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దివిటీని అందజేసి రన్‌ను ప్రారంభించారు. స్టేడియం నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా వరకు ఫ్రీడమ్‌ రన్‌ కొనసాగింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్‌గుప్తా, కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణీ, రాజశేఖర్‌రెడ్డి, సుజాతానాయక్‌, జోనల్‌ కమిషనర్‌ పంకజ, ఉపకమిషనర్లు హరికృష్ణయ్య, మారుతీదివాకర్‌, సురేందర్‌రెడ్డి, డీఎ్‌సడీఓ వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-08-12T06:07:41+05:30 IST