‘ఫ్రీడం ఆయిల్‌’ ఐసోలేషన్‌ కేంద్రం

ABN , First Publish Date - 2021-05-08T09:43:32+05:30 IST

కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారికోసం ఉప్పల్‌ సమీపంలోని ఆర్‌వీకే పాఠశాల వద్ద ఫ్రీడం అయిల్‌ సంస్థ 200 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సేవాభారతి సంస్థతో కలిసి ఈ సౌకర్యాలను సమకూర్చింది.

‘ఫ్రీడం ఆయిల్‌’ ఐసోలేషన్‌ కేంద్రం

హైదరాబాద్‌ సిటీ, మే 7 (ఆంధ్రజ్యోతి):  కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారికోసం ఉప్పల్‌ సమీపంలోని ఆర్‌వీకే పాఠశాల వద్ద ఫ్రీడం అయిల్‌ సంస్థ 200 పడకల ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సేవాభారతి సంస్థతో కలిసి ఈ సౌకర్యాలను సమకూర్చింది. ఈ ఐసోలేషన్‌ కేంద్రంలో రోగులకు వైద్యసహాయం, ఆహారం, వసతి, టెలీమెడిసిన్‌ వంటి సేవలను ఉచితంగా అందిస్తారు. ఈ సందర్భంగా ఫ్రీడం కుకింగ్‌ ఆయిల్స్‌ సేల్స్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థ సేవాభారతితో కలిసి తాము పనిచేస్తున్నట్లు, రెండు నెలలపాటు కొవిడ్‌ రోగులకు సేవచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ ఐసోలేషన్‌ కేంద్రంలో చేరాలనుకునేవారు 040- 48212529 నంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు.  

Updated Date - 2021-05-08T09:43:32+05:30 IST