ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కీలకం: అమిత్ షా

ABN , First Publish Date - 2021-09-05T02:45:36+05:30 IST

ప్రజాస్వామ్యం మన విధానం. స్వాతంత్ర్య ముందు మనది ఇదే స్వభావం, స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం మనం దీన్ని అధికారికం చేసుకున్నాం. ఇదే మన ప్రజల మనస్తత్వం, వ్యక్తిత్వం. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది ఏంటంటే.. వ్యక్తిగత స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే కవలం

ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కీలకం: అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న పౌరులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీటి ద్వారానే మంచి పాలసీలు వస్తాయని, వీటికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్&డీ) 51వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


‘‘ప్రజాస్వామ్యం మన విధానం. స్వాతంత్ర్య ముందు మనది ఇదే స్వభావం, స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం మనం దీన్ని అధికారికం చేసుకున్నాం. ఇదే మన ప్రజల మనస్తత్వం, వ్యక్తిత్వం. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనది ఏంటంటే.. వ్యక్తిగత స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే కవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు. ఇది ప్రజాస్వామ్య విధానంలో ఒక భాగం మాత్రమే. ప్రజాస్వామ్య ఫలాలు ఏమిటంటే.. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సామర్థ్యాలు, తెలివితేటల ప్రకారం తమను తాము అభివృద్ధి చేసుకుంటూ, దేశాభివృద్ధికి ప్రయోజనాన్ని అందివ్వడం’’ అని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో పోలీసుల పాత్రా చాలా కీలకమని, శాంతిభద్రతలు సరిగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతానికి మార్గం సుగమం అవుతుందని అమిత్ షా అన్నారు.

Updated Date - 2021-09-05T02:45:36+05:30 IST