స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాలి

ABN , First Publish Date - 2022-08-15T08:25:17+05:30 IST

స్వాతంత్య్ర వజ్రో త్సవాలు అంబరాన్నంటాలని, సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ పిలుపుని చ్చారు.

స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటాలి
ముస్తాబైన సింగరేణి ప్రకాశం గ్రౌండ్‌

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి 

కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ ఆదేశం 

వజ్రోత్సవాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌

కొత్తగూడెం(ఆంధ్రజ్యోతి)/ కొత్తగూడెం కలెక్టరేట్‌/ జూలూరుపాడు/ రుద్రంపూర్‌/ పాల్వంచ టౌన్‌, ఆగస్టు 14: స్వాతంత్య్ర వజ్రో త్సవాలు అంబరాన్నంటాలని, సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ పిలుపుని చ్చారు. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణపై ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉదయం 10 గంటల వరకు ప్రగతి మైదానానికి చురుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.  16న ఉదయం 11.30 గంటలకు జిల్లా వ్యాప్తంగాజాతీయ గీతాలాపనలో పా ల్గొనాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె వెంకటే శ్వర్లు పాల్గొన్నారు. 

విద్యుత్‌ కాంతుల్లో కల్టెరేట్‌ భవనం

స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని రంగురంగుల విద్యుత్‌ దీపాల తో అందంగా అలంకరించారు. నూతన భవనం ప్రా రంభించకున్నా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అందంగా తీర్చిద్దిదడంతో చూపరులను ఇట్టె ఆకర్షిస్తోంది. దీంతో కొత్తగూడెం-పాల్వంచ జంట పట్టణాల మద్య గల నూతన భవనంలో న్యూలుక్‌ సంతరించింది. దీంతో రోడ్డున ప్రయానించే ప్రయాణికులు కొంతసేపు కలెక్టరేట్‌ అందాన్ని తిలకించి సెల్ఫీలు తీసుకోని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు సర్వంసిద్దం

జూలూరుపాడు మండలంలో 75వ స్వాతంత్య్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీడీవో, తహసిల్దార్‌ కార్యాలయాలను తోరణాలతో అలంకరించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌ జాతీయ  పథకాలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని ప్రధాన సెంటర్లలో జాతీయ జెండాలు, సీరిస్‌ లైట్లు, బెలూన్సు వంటి వాటితో సుందంగా డెకరేషన్‌ చేశారు. 

ప్రకాశం మైదానం ముస్తాబు

స్వాతంత్య్ర వేడుకలకు సింగరేణి ప్రకాశంస్టేడియం గ్రౌండ్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరిస్తారని ప్రచారం చేశారు. మూడు సంవత్సరాలుగా జెండా ఆవిష్కరణకు చైర్మన్‌ హాజరుకాకపోవడంతో సింగరేణి డైరెక్టర్‌ (పా)నే ఆ క్రతువు పూర్తి చేస్తున్నారు. ఈసారైనా చైర్మన్‌ జెండా ఆవిష్కరణకు వస్తారా.. రారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణిలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు సన్మానించనున్నారు. 11 ఏరియాలకు సంబంధించి 11మంది ఉత్తమ కార్మికులను యాజమాన్యం ఎంపిక చేసింది. 

ఇన్నోవేషన్‌ పోటీల్లో ఐదు ఆవిష్కరణల ఎంపిక

రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఏర్పాటుచేసిన ఇంటింటా ఇన్నోవేషన్‌ పోటీల్లో జిల్లాకు ఐదు ఆవిష్కరణలు ఎంపికైనట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. నేటి సమాజంలోని వివిధ రకాలైన వ్యక్తులు, అక్షరాస్యులు, వృద్దులు, నిరక్షరాస్యులు చదువులు మద్యలోనే మానివేసిన వారు, గృహిణులు తదితర వారిలో నిక్షిప్తమైన ఆలోచనలు వెలుపలికి తీయడానికి ఇంటింటా ఇన్నోవేషన్‌ అనేది ఒక వేదికగా ఉందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోగా శుక్రవారం రాష్ట్ర ఇన్నోవేషన్‌ విభాగం ఐదు ఆవిష్కరణలను జిల్లా నుంచి ఎంపికైనట్లు ప్రకటించారు. ఎంపికైన ప్రాజెక్టులు సోమవారం ప్రగతిమైదానంలో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రదర్శిస్తామన్నారు. వీటికి సంబంధించిన మరింత సమాచారం ఇంటింటా ఇన్నోవేషన్‌ కో-ఆర్డినేటర్‌ డీఎస్‌వో చలపతిరాజు 9247296012 సెల్‌ నెంబర్‌ను సంప్రదించా ల్సిందిగా సుచించారు. 

బాణసంచా కాల్చి వేడుకలు

భారత 75 స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్‌ సెంటరులో భారీ స్థాయిలో బాణసంచాకాల్చి వేడుకలు ని ర్వహించారు. బాణసంచా వెలుగు జిలుగులతో బీసీఎం రోడ్‌ అంబేద్కర్‌ సెంటర్‌ సందడిగా మారింది. ఈ కా ర్యక్రమంలో కమిషనర్‌ చింత శ్రీకాంత్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, ఎస్‌ఐ నరేష్‌, అదనపు ఎస్‌ఐప్రవీణ్‌, డీఈ మురళీ, ఎఈ రాజేష్‌, శానిటరి అధికారి లక్ష్మణరావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T08:25:17+05:30 IST