సమరయోధుల పోరాట ఫలితమే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-14T05:20:54+05:30 IST

ఎందరో స్వతంత్ర సమరయోధులు పోరాడితే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, తద్వారానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

సమరయోధుల పోరాట ఫలితమే స్వాతంత్య్రం
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

= కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

 గద్వాల క్రైం ,ఆగస్టు 13: ఎందరో స్వతంత్ర సమరయోధులు పోరాడితే మనకు స్వాతంత్య్రం వచ్చిందని,  తద్వారానే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం ఫ్రీడం ర్యాలీ నిర్వహించగా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ తేరుమైదానం నుంచి సుంకులమ్మ మెట్టు, కొత్తబస్టాండ్‌, కృష్ణవేణి చౌకర్‌, రాజీవ్‌మార్గ్‌ మీదుగా తిరిగి తేరు మైదానం చేరుకొంది. పోలీస్‌ అఽధికారులు, ఇతర శాఖల అధికారులు జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల చిన్నారులు, సమరయోధుల వేషధారణలో వచ్చి, జాతీయ జెండాలను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో  అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఏఎస్పీ రాములు నాయక్‌, డీఎస్పీ రంగస్వామి, మునిసిపల్‌ కమిషనర్‌ జానకిరామ్‌సాగర్‌, జిల్లా అధికారులు ఉన్నారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

  స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు ఆయా ప్రభుత్వ శాఖలు సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివారం బాలభవన్‌లో జరిగే కళాకారుల ప్రదర్శనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  16న జరిగే జాతీయ గీతాలాపనకు గ్రామ, పట్టణ స్థాయిల్లో ప్రధాన కూడళ్లలో మైక్‌లు ఏర్పాటు చేసి ప్రజలందరు పాల్గొనే చూడాలన్నారు. అదేరోజు బాలభవన్‌లో జరిగే కవి సమ్మేళనం కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. 17న రక్తదాన శిబిరాన్ని,  18న ఫ్రీడం కప్‌ స్పోర్స్‌ అన్ని మున్సిపాలిటీ పరిధిలో, ఎంపీడీవోల పరిధిలో నిర్వహించాలని, 19న జిల్లాలో ఉన్న ప్రతి వృదాశ్రమం, ఆస్పత్రిలో స్వీట్స్‌ పంపిణీ, 20న రంగోలి పోటీలు, 21న గ్రామ పంచాయితీ, మండల, జడ్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు.  అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌ మైదానాన్ని పరిశీలించి, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-08-14T05:20:54+05:30 IST