Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 16 Aug 2022 01:03:51 IST

మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం

twitter-iconwatsapp-iconfb-icon
మహనీయుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రంపోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

దేశంలోనే ఆదర్శ రాష్ట్రం తెలంగాణ

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం

గాంధీజీ మార్గంలోనే తెలంగాణను సాధించిన కేసీఆర్‌

ఆకలిచావులు లేని తెలంగాణగా మార్చిన సీఎం

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 15: ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే బ్రిటీష్‌ వలస పాలకులను తరిమికొట్టి స్వతంత్య్ర భారతావనిగా అవతరించిందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రంలోనే తెలం గాణ అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్‌ మహాత్మాగాంధీ మార్గాన్ని అనుసరించి తెలంగాణ ఉద్యమా న్ని ప్రారంభించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారన్నారు. స్వాతంత్య్రం కోసం 1857లో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన సంగ్రామానికి కొనసాగింపుగా జాతిపిత మహాత్మగాంధీ, నెహ్రు, పటేల్‌, నేతాజీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వంటి మహానుభావులు స్వాతంత్ర్యోదమానికి పునాదు లు వేశారని తెలిపారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తర్వాత తరం వారైనా బానిస బతుకులు అనుభవించకుండా స్వాతంత్య్ర జీవితాన్ని అనుభవించాలనే ఆశయంతో స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది అశువులు బాశారన్నా రు. ఆ మహానీయుల ఆదర్శ స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ మహాత్మగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. త్యాగధనుల చరిత్రలను మలినం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహనీయుల చరిత్రలను మరుగునపెట్టి సమాజంలో వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఎనిమిదేళ్ల పాలనలో అనేక ఒడిదొడుకులను తట్టుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. గాంధీజీ కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని కొనియాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణను సీఎం కేసీఆర్‌ సాధించారని వివరించారు. 

.  రైతుబంధు పథకం కింద జిల్లాలో 2.60లక్షల మంది రైతులకు ఈ వానాకాల సీజన్‌లో ఎకరానికి రూ.5వేల చొప్పు న పంట సాయం కోసం రూ.309కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. 

.  జిల్లాలో ఇప్పటి వరకు 678మంది రైతులు చనిపోగా రైతు బీమా పథకం ద్వారా వారి కుటుంబ సభ్యులకు రూ.34కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. 

.  సాగు, తాగునీటి రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. అందుకోసం కృష్ణా, గోదావరి నీటిలో రాష్ట్ర వాటాలను దక్కించుకోవడంతో పాటు వృథా నీటిని పొదుపు చేసేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. 

.  కాళేశ్వరం ద్వారా జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజక వర్గాల్లో ప్రతి ఎకరాకు సాగు నీరు అందనుందని స్పష్టం చేశారు. జిల్లాలో సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  

.  జిల్లాలో కేవలం వరి, పత్తి పంటలే కాకుండా కూరగాయలు, వివిధ రకాల పండ్లు, పట్టు పరిశ్రమ, పామాయిల్‌ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పించి రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. 

.  పేద మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని వివరించారు. అందులో భాగంగా సూర్యాపేటకు మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

.  కరోనా వ్యాధిగ్రస్తుల కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించినట్లు వివరించారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు సంబంధించి జిల్లాలో షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా 35వేల 487 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడపడుచులకు రూ.311.45కోట్లను అందించినట్లు తెలిపారు. 

.  దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 

.  జిల్లాలో భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 284 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున 1975 కుటుంబాలకు పాక్షికంగా కలిపి మొత్తం రూ.49.71కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. 

. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగినా ప్రదేశానికి సమాచారం అందిన పది నిమిషాల వ్యవధిలో చేరుకొని బాధితులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. 

.  సమాజాన్ని పట్టిపీడిస్తున్న నిషేధిత గంజాయిని అరికట్టడంలో పోలీసుల కృషి మరువలేనిదన్నారు. సమాజ రక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మేము సైతం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో 650సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

.  మహిళల రక్షణ కోసం ఐదు షీ టీమ్‌ బృందాలు పని చేస్తూ 224 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం సూర్యాపేట జిల్లా పోలీస్‌ వాట్సాఫ్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరించేందుకు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అన్ని పోలీస్‌ స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.


ఆస్తుల పంపిణీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రి జగదీ్‌షరెడ్డి ఆస్తులు పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలో  పట్టణ  మహిళా సంఘాలకు రూ.7.12కోట్ల విలువైన చెక్కును అందజేశారు. దీంతో పాటు జిల్లాలోని భానుపురి మహిళ సమాఖ్య సంఘాల సభ్యులకు రూ.38.88కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నూతనంగా 57ఏళ్లు పైబడిన వారికి అందించే ఆసరా ఫించన్లను పలువురు లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పలువురు స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి జగదీ్‌షరెడ్డి ఘనంగా సన్మానించారు. 


 ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని బాల కేంద్రం, దోసపాడులోని మోడల్‌ స్కూల్‌, జిల్లా కేంద్రంలోని ఎంఎ్‌సఆర్‌  సెంట్రల్‌ స్కూల్‌,  పాఠశాల చివ్వెంల, ఆదర్శ పాఠశాల సూర్యాపేట విద్యార్థులు వివిధ అంశాలకు సంబంధించి నృత్యాలు చేశారు.

.  వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లాంగయ్యయాదవ్‌, కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకిస్తూ వాటి ఆవశ్యకతను అడిగి తెలుసుకున్నారు. 

 ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, నేరేడుచర్ల మునిసిపల్‌ చైర్మన్‌ జయబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీవైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.