Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నియంత పాలన నుంచి త్వరలో విముక్తి

twitter-iconwatsapp-iconfb-icon
నియంత పాలన నుంచి త్వరలో విముక్తి సమావేశంలో మాట్లాడుతున్న బాబుమోహన్‌

  • రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలు
  • ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో బీజేపీదే అధికారం 
  • మాజీ మంత్రి బాబుమోహన్‌ 


ఆమనగల్లు, ఆగస్టు 6 : రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ, నియంత పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు బాబుమోహన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌, వెంకట్రావ్‌పేట, గట్టిప్పలపల్లి, మెదక్‌పల్లి, చౌదర్‌పల్లి, వెల్జాల, చంద్రధన గ్రామాల్లో శనివారం ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బాబుమోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు, రోడ్డుషోలు, బీజేపీ జెండావిష్కరణ కార్యక్రమాలు, సభలు నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన సభల్లో బాబుమోహన్‌ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభంజనం మొదలైందని, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకొనున్నాయన్నారు. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ నిరంకుశపాలన సాగిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించే వరకూ బీజేపీ శ్రేణులు సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదని, టీఆర్‌ఎస్‌ పాలనాపరంగా విఫలమైందని అందుకే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు త్వరలోనే తుడిచి పెట్టుకు పోతాయని అన్నారు. మోదీ పాలనా దక్షతతో దేశం 8ఏళ్లలో అద్భుత విజయాలు సాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కల్వకుర్తి నియోజకవర్గంలో ఆచారి విజయం ఖాయమని బాబుమోహన్‌ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవిగౌడ్‌, నాయకులు బక్కికుమార్‌, శానమోనిపాండు, పద్మ అనిల్‌, నీలంకంఠం పాండురమేశ్‌, గణేశ్‌, భరత్‌, శ్రీశైలంయాదవ్‌, శేఖర్‌రెడ్డి, పెరుమల్ల రాజు, ఆనంద్‌, సూర్యనాయక్‌, విజయ్‌, గెల్వలయ్య, సుదర్శన్‌, శ్రీనివాస్‌రెడ్డి, శాంతకుమారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట కాంగ్రెస్‌ నాయకుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇమ్మడి మహేశ్‌ తన అనుచరులతో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు ఆచారి, బాబుమోహన్‌లు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.