స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-08-11T05:41:00+05:30 IST

దేశ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల   త్యాగాలు స్ఫూర్తిదాయకం
హౌసింగ్‌బోర్డు ఫ్రీడం చిల్డ్రన్స్‌ పార్కు ప్రారంభిస్తున్న మంత్రి గంగుల

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 


కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 10: దేశ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కరీం నగర్‌ హౌసింగ్‌ బోర్డుకాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్‌ను మంత్రి బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహి స్తున్నామని చెప్పారు. ఈనెల 22వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామ న్నారు. ప్రతి విద్యార్థి మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలుసుకొని శాంతి, అహింసా వంటి సిద్ధాంతాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ నేటి తరానికి స్వాతంత్య్ర పోరాటం గురించి తెలియజేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారని చెప్పారు. 2047 వరకు దేశం గొప్ప అభివృద్ధిని సాధిస్తుందన్నారు. అనంతరం నగరంలోని ప్రతిమా మల్టీ ప్లెక్స్‌లో విద్యార్థుల కోసం ప్రదర్శిస్తున్న గాంధీజీ చిత్రాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వారు తిలకించారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, కార్పొరేటర్‌ ఆకుల ప్రకాశ్‌ పాల్గొన్నారు. 


 కొత్తపల్లిని ఆదర్శంగా మున్సిపాలిటీగా తీర్చుదిద్దుతాం


కరీంనగర్‌ రూరల్‌: కొత్తపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని  మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం కొత్తపల్లి పట్టణంలో అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఆరు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నా రు. కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కమిషనర్‌ వేణుమాధవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:41:00+05:30 IST