స్వాతంత్య్ర సమరయోధుడు లక్ష్మీనర్సయ్య మృతి

ABN , First Publish Date - 2022-01-19T05:34:20+05:30 IST

మండల పరిధిలోని దూపహాడ్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ సర్పంచ్‌, సీపీఎం సీనియర్‌ నేత నల్లపాటి లక్ష్మీనర్సయ్య(96) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుడు లక్ష్మీనర్సయ్య మృతి
లక్ష్మీ నర్సయ్య (ఫైల్‌)

పెన్‌పహాడ్‌, జనవరి 18: మండల పరిధిలోని దూపహాడ్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ సర్పంచ్‌, సీపీఎం సీనియర్‌ నేత నల్లపాటి లక్ష్మీనర్సయ్య(96) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సాయుధ పోరాటం లో భీంరెడ్డి నర్సింహారెడ్డి, ముల్లు స్వరాజ్యం, ధనియాకుల గురువయ్య నాయకత్వంలో లక్ష్మీనర్సయ్య పనిచేశారు. దూపహాడ్‌ సర్పంచ్‌గా మూడు పర్యాయాలు పనిచేశారు. ఆయన భార్య అనుసూర్యమ్మ సైతం ఒక దఫా సర్పంచ్‌గా పనిచేశారు. ఆమె 2010లో మృతిచెందారు. వీరు గ్రామంలో పలు అభివృద్ధి పనులు నిర్వహించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా, లక్ష్మీనర్సయ్య అంత్యక్రియలు సూర్యాపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో బుధవారం నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. 

Updated Date - 2022-01-19T05:34:20+05:30 IST