Abn Andhrajyothy Debate: ఉచితమేదో.. సంక్షేమమేదో తేల్చేదెలా?

ABN , First Publish Date - 2022-08-18T01:35:44+05:30 IST

ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని ..

Abn Andhrajyothy Debate: ఉచితమేదో.. సంక్షేమమేదో తేల్చేదెలా?

న్యూఢిల్లీ: ఉచిత తాయిలాలపై హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana) చెప్పారు. ప్రజలకు సంక్షేమాన్ని అందజేయవలసిన కర్తవ్యం ప్రభుత్వాలకు ఉందని చెప్పారు. బీజేపీ నేత అశ్విని కుమార్ (Ashwini Kumar Upadhyay) ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణలో తమ వాదనలను కూడా వినాలని డీఎంకే (DMK) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 


అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌లో, ఎన్నికల ప్రచారంలో ఉచిత తాయిలాల (Freebies)పై హామీలు ఇవ్వడాన్ని అనుమతించకుండా ఎన్నికల కమిషన్‌ (Election Commission)కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు చాలా సంక్లిష్టమవుతున్నాయని అభిప్రాయపడింది. 


ఈ పిటిషన్‌పై విచారణలో తమ వాదనలను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే సుప్రీంకోర్టును కోరాయి. జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఏది ఉచిత తాయిలం? ఏది కాదు? అనే అంశం చాలా సంక్లిష్టమవుతోందన్నారు. హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీల (Political Parties)ను నిరోధించలేమని చెప్పారు. ఏవి సరైన హామీలు? అనేదే ప్రశ్న అని అన్నారు. ఉచిత విద్యను తాయిలం అని అనగలమా? అన్నారు. ఉచిత తాగునీరు, కనీస స్థాయిలో విద్యుత్తును ఉచితంగా అందజేయడాన్ని తాయిలంగా చెప్పగలమా? అన్నారు. వినియోగదారుల ఉత్పత్తులు, ఉచిత ఎలక్ట్రానిక్స్ పరికరాలను సంక్షేమంగా వర్ణించగలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి ఏది సరైన మార్గం? అనేదే ప్రస్తుత చర్చనీయాంశమని అన్నారు. డబ్బు వృథా అవుతోందని కొందరు అంటారని, అది సంక్షేమమని మరికొందరు అంటారని అన్నారు. ఈ విషయాలు రాన్రానూ జటిలమవుతున్నాయన్నారు. ‘‘మీరు మీ అభిప్రాయాలను చెప్పండి, చర్చి్ంచి, ఆలోచించి, నిర్ణయిస్తాం’’ అని చెప్పారు. 


ఈ నేపథ్యంలో ‘‘ఉచితమేదో సంక్షేమమేదో తేల్చేదెలా?. సంక్షేమ విద్య, వైద్యం ఉచితాలు కావా?. ఉచిత వాగ్దానాలు ఇవ్వకుండా పార్టీలను ఆపేదెలా?. దోపిడీని వదిలేసి ఉచితంపై రాద్ధాంతం ఏంటి?. పార్టీల వాగ్దానాలే ఎన్నికల్ని శాసిస్తున్నాయా?.ప్రజలకే వదిలేయాలని ఎన్నికల సంఘం అనడం ఏంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడయోను చూడగలరు..





Updated Date - 2022-08-18T01:35:44+05:30 IST