Abn logo
Mar 27 2020 @ 08:43AM

‘ఉజ్వల’ లబ్దిదారులకు జూన్ వరకు ఉచితంగా గ్యాస్

  • జూన్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు
  • కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి 

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో పేదలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త వెల్లడించారు.  కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలోని ‘ఉజ్వల’ ఎల్‌పీజీ కనెక్షన్లున్న వినియోగదారులకు జూన్ నెలాఖరు వరకు ఉచితంగా గ్యాస్ అందిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు.


లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశంలోని గ్రామాలు, పట్టణాల్లో పేదలు, రైతులు, వలస కార్మికులకు ఆహారం అందించేందుకు వీలుగా నిత్యావసర సరకులతోపాటు గ్యాస్ సిలిండర్లను కూడా ఉచితంగా అందిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. దేశంలో 3.18 కోట్లమందికి ఉజ్వల ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వీరందరికీ ఉచితంగా జూన్ నెలాఖరు వరకు గ్యాస్ ను సరఫరా చేస్తామని మంత్రి వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement