Free Travel to Women: రాఖీ సందర్భంగా అరుదైన బహుమతి.. ఏసీ బస్సుల్లో అయినా సరే స్త్రీలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-08-10T17:09:19+05:30 IST

ఆగస్టు 11.. రాఖీ పండుగ.. అన్నా చెల్లెళ్ల అనుబంధం...

Free Travel to Women: రాఖీ సందర్భంగా అరుదైన బహుమతి.. ఏసీ బస్సుల్లో అయినా సరే స్త్రీలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే..

ఆగస్టు 11.. రాఖీ పండుగ.. అన్నా చెల్లెళ్ల అనుబంధం వెల్లివిరిసే వేళ... ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రత్యేక కానుకను ప్రకటించాయి. చండీగఢ్‌‌కు చెందిన మహిళలు తమ సోదరునికి రాఖీ కట్టేందుకు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందవచ్చు. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు (బుధవారం) రాత్రి 12 గంటల నుంచి గురువారం రోజంతా మహిళలు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. చండీగఢ్ నుండి పంచకుల, మొహాలీకి సీటీయూ బస్సులలో ఉచిత ప్రయాణ కల్పించనున్నారు. 


ఇందుకోసం సీటీయూ బస్సుల్లో మహిళలు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి బస్ కండక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సదుపాయాన్ని కల్పించింది. రక్షాబంధన్ రోజున పంజాబ్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. హర్యానాలో మహిళలతో పాటు పిల్లలకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. రక్షాబంధన్ రోజు అర్ధరాత్రి వరకు బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇది రక్షా బంధన్ రోజున ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. హర్యానా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఆర్డినరీ మరియు స్టాండర్డ్ బస్సులలో మహిళలకు ఈ సౌకర్యం కల్పించారు. రక్షా బంధన్ రోజన రోడ్‌వేస్ ఉద్యోగుల సెలవులను  ఇక దేశరాజధాని ఢిల్లీలోనూ రక్షా బంధన్ సందర్భంగా మహిళలకకు ఉచిత్ర ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఇందుకోసం 45 బస్సులను కూడా నడపనున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక నగదు అందజేస్తామమని సంబంధిత అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-10T17:09:19+05:30 IST