విద్యుత్‌ వాహనాల నిర్వహణపై ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-08-09T07:10:58+05:30 IST

విద్యుత్‌ వాహనాల నిర్వహణపై మూడు నెలల వ్యవధి గల ఉచిత శిక్షణ కోర్సును కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభించనున్నట్టు ప్రిన్సిపాల్‌ జీవీవీ సత్యనారాయణ మూర్తి తెలిపారు.

విద్యుత్‌ వాహనాల నిర్వహణపై ఉచిత శిక్షణ

కంచరపాలెం, ఆగస్టు 8 : విద్యుత్‌ వాహనాల నిర్వహణపై మూడు నెలల వ్యవధి గల ఉచిత శిక్షణ కోర్సును కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రారంభించనున్నట్టు ప్రిన్సిపాల్‌ జీవీవీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇటీవల స్కిల్‌ హబ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నైపుణ ్య శిక్షణలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి మూడు నెలల కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఐటీఐ, డిప్లోమా(ఎలక్ర్టికల్‌, మెకానికల్‌) కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు విహాన్‌ ఎలక్ర్టిక్స్‌ సంస్థలో ఉద్యోగాలు కల్పించడానికి సుముఖత చూపారన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 7287069457 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


Updated Date - 2022-08-09T07:10:58+05:30 IST