ఉచిత వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-05-25T06:22:29+05:30 IST

యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, రాజమహేంద్రవరం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఫొటోగ్రఫీ, వీడియోమిక్సింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌;హౌస్‌ వైరింగ్‌ ఎయిర్‌కండీషనింగ్‌ రిప్రిజరేటర్‌ రిపేరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఉచిత వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

రాజమహేంద్రవరంరూరల్‌, మే 24: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, రాజమహేంద్రవరం, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఫొటోగ్రఫీ, వీడియోమిక్సింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌;హౌస్‌ వైరింగ్‌ ఎయిర్‌కండీషనింగ్‌ రిప్రిజరేటర్‌ రిపేరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళ లోపు వయస్సు వారై ఉండి 10వ తరగతి పాస్‌, ఫెయిలైన అభ్యర్థులు సైతం అర్హులన్నారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు పదో తరగతి సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జిరాక్సు, 4 పాస్‌పోర్టు సైజ్‌  ఫొటోలతో సంప్రదించాలన్నారు. శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, బోజనం,టూల్‌కిట్స్‌ ఇస్తామన్నారు.వివరాలకు 83338 14433, 0883- 2428807, 0883-2420242  నెంబర్లలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2022-05-25T06:22:29+05:30 IST