జియోఫోన్లపై ఉచిత టాక్‌టైమ్‌

ABN , First Publish Date - 2021-05-15T06:07:16+05:30 IST

జియోఫోన్‌ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రిలయ న్స్‌ ఫౌండేషన్‌తో కలిసి కంపెనీ ఈ ఆఫర్‌ ప్రకటించింది

జియోఫోన్లపై ఉచిత టాక్‌టైమ్‌

నెలకు 300 నిమిషాలు


న్యూఢిల్లీ: జియోఫోన్‌ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రిలయ న్స్‌ ఫౌండేషన్‌తో కలిసి కంపెనీ ఈ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద జియోఫోన్‌ వినియోగదారులు రోజుకు 10 నిమిషాల చొప్పున నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ టాక్‌టైమ్‌ అందుకోవచ్చు. కొవిడ్‌ మహమ్మారి ముగిసే వర కు ఈ ఆఫర్‌ అమల్లో ఉంటుంది. కొవిడ్‌ రెండో ఉధృతి నేపథ్యంలో చాలా మంది జియోఫోన్‌ వినియోగదారులు తమ ప్లాన్లను రీచార్జి చేయించుకోలేక పోయారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. తమ ప్లాన్స్‌ను రీచార్జి చేయించుకున్న జియోఫోన్‌ వినియోగదారులకూ జియో తీపికబురు చెప్పింది. వీరు ఎంత విలువకు రీచార్జి చేయించుకున్నారో అంతే విలువైన రీచార్జి ప్లాన్‌ను ఉచితంగా అందిస్తారు. అయితే ఈ ఉచిత ఆఫర్లు, జియోఫోన్‌ బండిల్డ్‌ ప్లాన్ల మీద, వార్షిక ప్లాన్ల మీద వర్తించవు.

Updated Date - 2021-05-15T06:07:16+05:30 IST