Free shows: ఏడాది పాటు ఎన్టీఆర్ సినిమాలు ఉచితంగా ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-01T16:45:34+05:30 IST

గుంటూరు: ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పెమ్మసాని థియేటర్లో ఏడాది పాటు ఆయన చిత్రాలను ఉచితంగా

Free shows: ఏడాది పాటు ఎన్టీఆర్ సినిమాలు ఉచితంగా ప్రదర్శన

గుంటూరు: ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పెమ్మసాని థియేటర్లో ఏడాది పాటు ఆయన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా (Alapati Raja) ఆధ్వర్యంలో తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెమ్మసాని థియేటర్లో డ్రైవర్ రాముడు చిత్రాన్ని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ (Nandamuri Mohan Krishna) మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలసి తిలకించారు. 

 

ఎన్టీఆర్ బిడ్డగా పుట్టటం నా అదృష్టం..నందమూరి. మోహనకృష్ణ

‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఆయనకు బిడ్డగా పుట్టాను. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న మాజీమంత్రి ఆలపాటి రాజాకు నా కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ఉత్సవాలకు గెస్టుగా కాకుండా మా ఇంట్లో జరిగే పండుగగా భావిస్తున్నాం. నా చేతుల మీదుగా జయసుధ‌కి ఎన్టీఆర్ అవార్డ్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. పెమ్మసాని థియేటర్ యాజమాన్యంకి ప్రత్యేక కృతజ్ఞతలు. డ్రైవర్ రాముడు సినిమా చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.’’ అని మోహనకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-01T16:45:34+05:30 IST