Dubai: మూడు రోజుల పాటు నో పార్కింగ్ ఫీజు

ABN , First Publish Date - 2022-05-15T15:54:35+05:30 IST

దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాప దినాల్లో భాగంగా మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజును రద్దు చేసినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు.

Dubai: మూడు రోజుల పాటు నో పార్కింగ్ ఫీజు

దుబాయ్: దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాప దినాల్లో భాగంగా మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజును రద్దు చేసినట్లు దుబాయ్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ ఆర్‌టీఏ సమాచారం మేరకు.. ఈ నెల 14వ తేదీ(శనివారం) నుంచి సోమవారం(మే 16) వరకు వాహనదారులు నగరంలో ఎక్కడా పార్కింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. తిరిగి 17వ తేదీ నుంచి యధావిధిగా పార్కింగ్ రుసుమును పునరుద్ధరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆర్‌టీఏ పేర్కొంది. అధ్యక్షుడు, దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ సంతాప సూచికంగా ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్‌లోని అన్ని విభాగాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అటు షార్జాలో కూడా ఇప్పటికే మూడు రోజుల ఉచిత పార్కింగ్ అమలు అవుతోంది. 

Updated Date - 2022-05-15T15:54:35+05:30 IST