17న ఉచిత వైద్యశిబిరం

ABN , First Publish Date - 2021-04-13T05:56:59+05:30 IST

పట్టణంలోని శ్రీవాసవీమహాల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17న ఉచిత వైద్య శిబిరాన్ని ని ర్వహిస్తున్నారు.

17న ఉచిత వైద్యశిబిరం

గోరంట్ల, ఏప్రిల్‌ 12: పట్టణంలోని శ్రీవాసవీమహాల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 17న ఉచిత వైద్య శిబిరాన్ని ని ర్వహిస్తున్నారు. గోరంట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బలరాంగుప్తా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. అనంతరం కిమ్స్‌ సవేరా ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో గుండె, ఎముకలు, నరాలు, గర్బసంబంధిత తదితర ఆరోగ్యసమస్యలకు ప్రత్యేక వైద్యులచే చికిత్సలు నిర్వహిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు కోరారు. 

Updated Date - 2021-04-13T05:56:59+05:30 IST