ఉచిత న్యాయ సహాయం ప్రతి ఒక్కరికీ అందాలి

ABN , First Publish Date - 2021-10-26T04:18:30+05:30 IST

జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ద్వారా ప్రజలందరికీ

ఉచిత న్యాయ సహాయం ప్రతి ఒక్కరికీ అందాలి
సమావేశంలో మాట్లాడుతున్న రేణుక

  • తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరీ రేణుక 

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ద్వారా ప్రజలందరికీ  ఉచిత న్యాయ సహాయం అందిం చాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్‌ సెక్ర టరీ వై.రేణుక అన్నారు. ఉచిత న్యాయ సహాయం, అవగాహన కార్యక్రమాల నిర్వహణపై  సోమ వారం కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, టీమ్‌ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో న్యాయ సేవా చట్టం అమల్లోకి వచ్చి 25 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీక అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా నవంబర్‌ 14 వరకు అన్ని గ్రామాల్లో ఉచిత న్యాయం చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఉచిత వైద్యం ఎలా అందుతుందో.. అలాగే జిల్లాలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో పేద ప్రజలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని తెలిపారు. మహిళలు, పిల్లలు, కార్మికులతోపాటు వార్షికాదాయం రూ. 3లక్షల కంటే తక్కువ ఉన్నవారికి ఉచిత న్యాయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందుతుందని, దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజిక కార్యకర్తలు సహకరించాలని కోరారు. ప్రస్తుతం సమాజంలో 30శాతం మంది మాత్రమే ఉచిత న్యాయ సేవను వినియోగించుకుంటున్నారని మిగిలిన 70శాతం మంది తమ ఆస్తులను అమ్ముకుని న్యాయసహాయం పొందుతున్నారని తెలిపారు. అందుకే ప్రజలందరికీ ఉచిత న్యాయసహాయం అందించేందుకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్‌ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు న్యాయసేవల వారోత్స వాలను నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. జ్యూడిషియల్‌ ఆఫీసర్‌, ప్యానల్‌ లాయర్‌, పారా లీగల్‌ వాలంటీర్లు, న్యాయ విద్యార్థులు, ఎన్జీవోలు, సామాజిక కార్య కర్తలతో టీమ్‌లను ఏర్పాటుచేసి గ్రామాల్లో ప్రజలకు ఉచిత న్యాయం, చట్టాలపై అవగాహన కల్పిస్తామ న్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆమె టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫ రెన్స్‌లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీదేవి, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ట్రైనీ కలెక్టర్‌ కదిరవన్‌ ఫలనీ, జిల్లా పరిషత్‌ సీఈఓ దిలీప్‌ కుమార్‌, జిల్లా సంక్షేమాధికారి మోతి, జిల్లా మైనార్టీ అధికారి రత్నకళ్యాణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-26T04:18:30+05:30 IST