చేపాక్‌ నియోజకవర్గంలో ఉచిత ఇంటర్నెట్‌

ABN , First Publish Date - 2022-04-15T15:47:50+05:30 IST

స్థానిక చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో 22 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించేందుకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) అనుమతించింది. స్మార్ట్‌ సిటీ పథకంలో

చేపాక్‌ నియోజకవర్గంలో ఉచిత ఇంటర్నెట్‌

- 20 ప్రాంతాల్లో వైఫై సేవలు 

- జీసీసీ అనుమతి


పెరంబూర్‌(చెన్నై): స్థానిక చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గంలో 22 ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు ప్రారంభించేందుకు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) అనుమతించింది. స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా జీసీసీ పరిధిలోని 49 ప్రాంతాల్లో స్మార్ట్‌ స్తంభాలు ఏర్పాటుచేసి, ప్రజలకు 30 నిమిషాలు ఉచిత వైఫై అందజేస్తున్నారు. 15వ మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఈ సదుపాయం ఉంది. ఈ క్రమంలో, చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గ పరిధిలోని వార్డుల్లో విద్యార్థుల సౌకర్యార్ధం వైఫై స్తంభాలు వేయించి ఉచిత ఇంటర్నెట్‌ సేవలు అందించాలని కోరుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయనిధి జీసీసీ కమిషనర్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి పరిశీలించి, నిబంధనలతో ఆయా ప్రాంతాల్లో వైఫ్‌ స్తంభాల ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థకు జీసీసీ అనుమతులు జారీచేసింది.

Updated Date - 2022-04-15T15:47:50+05:30 IST