ఆప్‌ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణ

ABN , First Publish Date - 2022-10-05T09:45:18+05:30 IST

ఢిల్లీ ప్రభుత్వ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా మంగళవారం ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లోగా తనకు నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

ఆప్‌ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణ

న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఢిల్లీ ప్రభుత్వ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా మంగళవారం ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లోగా తనకు నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. గుజరాత్‌ ఎన్నికలు ఉన్నందునే ఎల్‌జీ ఈ ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీ ఎల్‌జీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా, అప్పటి నుంచి కేజ్రీవాల్‌ సర్కారుపై పలు విచారణలకు ఆదేశించడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదేశాలకు అనుగుణంగా సక్సేనా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆప్‌ నేతలు విమర్శిస్తున్నారు. సక్సేనాను ఘాటుగా విమర్శిస్తూ ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయనకు ఒక లేఖ రాశారు. 


Updated Date - 2022-10-05T09:45:18+05:30 IST