ఢిల్లీలో ఉచిత విద్యుత్ ఫార్ములా ఏమిటో మీకు తెలుసా?

ABN , First Publish Date - 2022-05-08T15:42:48+05:30 IST

బొగ్గు కొరతతో పాటు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో...

ఢిల్లీలో ఉచిత విద్యుత్ ఫార్ములా ఏమిటో మీకు తెలుసా?

బొగ్గు కొరతతో పాటు బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. దీంతో ప్రజలు కరెంటు కష్టాలు పడుతున్నారు. విద్యుత్ రేట్లు పెరగడానికి బొగ్గు కూడా ఒక కారణం. ఎందుకంటే దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఎక్కువ భాగం థర్మల్ పవర్ ప్లాంట్‌లలోనే ఉత్పత్తి అవుతుంది. అయితే ఇక్కడ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేయడం ఢిల్లీ వినియోగదారులకు పెద్ద ఊరటగా నిలుస్తుంది. ఈ పథకం 2015 సంవత్సరం నుండి అమలులో ఉంది. ఇంతకుముందు ఈ పథకం భూస్వాములకు మాత్రమే పరిమితం అయ్యేది. అయితే గత 4 సంవత్సరాలుగా, అద్దెదారులను కూడా ఇందులో చేర్చారు. ఢిల్లీలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్తు ఖర్చు చేసే వినియోగదారుడికి జీరో బిల్లు వస్తుంది. అంటే కరెంటు కోసం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. 


మరోవైపు 201 యూనిట్ల నుంచి 400 యూనిట్ల మధ్య విద్యుత్తు వినియోగించినా 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో ఉచిత విద్యుత్ ఫార్ములా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీరో కరెంటు బిల్లు పథకాన్ని 2015లో ప్రారంభించారు. 2015 సంవత్సరంలో కేజ్రీవాల్ ప్రభుత్వం  ప్రతినెలా 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వినియోగదారుల కోసం జీరో విద్యుత్ బిల్లు పథకాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ప్రతి నెలా 201 నుండి 400 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు 50 శాతం రాయితీని కూడా అందించారు. ఈ విధంగా వినియోగదారులు తమ కరెంటు బిల్లులో కనీసం రూ.800 ఆదా చేయగలుగుతున్నారు. జీరో కరెంటు బిల్లు పథకం ఇంతకుముందు ఢిల్లీవాసులకు మాత్రమే పరిమితం అయ్యేది. అయితే 2019 సంవత్సరం నుండి ఢిల్లీలో నివసిస్తున్న అద్దెదారులను కూడా ఉచిత విద్యుత్ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. 75 శాతం మంది వినియోగదారులు విద్యుత్ బిల్లుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో దాదాపు 75 శాతం మంది వినియోగదారుల ఇళ్లలో విద్యుత్ బిల్లు జీరోకు వస్తోందని సమాచారం. నిజానికి ఏ రాష్ట్రానికీ ఉచితంగా కరెంటు అందదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలి. ఢిల్లీలోనూ అదే పరిస్థితి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో విద్యుత్ సబ్సిడీ కోసం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతర ఆదాయ వనరుల నుండి అభిస్తుంది. జీరో కరెంటు బిల్లు పథకం ప్రారంభించిన 2015-16 సంవత్సరంలో ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా బడ్జెట్‌లో ఇందుకోసం కేటాయింపులు జరుపుతున్నారు. ఈ ఏడాది అంటే 2021-21 బడ్జెట్‌లో ఢిల్లీ ప్రభుత్వం రూ.3,250 కోట్లు కేటాయించింది. ఇందుకోసం 016-17 సంవత్సరపు బడ్జెట్‌లో రూ.1577 కోట్లు కేటాయించారు. 2018-19లో రూ.1699 కోట్లు, 2019-20లో రూ.1720 కోట్లు, 2020-21లో రూ.2820 కోట్లు, 2021-22 బడ్జెట్‌లో రూ.3090 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది అంటే 2022-23లో ఢిల్లీ ప్రభుత్వం జీరో విద్యుత్ బిల్లు పథకానికి బడ్జెట్‌లో రూ.3,250 కోట్లు కేటాయించింది. ఈ విధంగా 7 సంవత్సరాలలో సబ్సిడీ మొత్తం 2050 కోట్లకు పెరిగింది. 

Read more