TET పరీక్షకు హాజరయ్యే ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-05-17T12:01:40+05:30 IST

సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌(సీఈడీఎం) ఆధ్వర్యంలో టీఎస్‌

TET పరీక్షకు హాజరయ్యే ఉర్దూ మీడియం అభ్యర్థులకు ఉచిత శిక్షణ

హైదరాబాద్‌ సిటీ : సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌(సీఈడీఎం) ఆధ్వర్యంలో టీఎస్‌ టెట్‌-2022 (TS TET-2022) పరీక్షకు హాజరయ్యే ఉర్దూ మీడియం అభ్యర్థులకు నిజాం కాలేజీలో ఉచిత శిక్షణ (Free Coaching) తరగతులు ప్రారంభించినట్లు సీఈడీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కలీమ్‌ అహ్మద్‌ జలీల్‌ తెలిపారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే దాదాపు 1,800 మంది విద్యార్థులు (Students) ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులకు ఐడీ కార్డులు జారీచేశామని, మెటీరియల్‌తోపాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలీం అహ్మద్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-05-17T12:01:40+05:30 IST