ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు విదేశీ చదువుల కోసం ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2022-06-24T22:54:50+05:30 IST

విదేశీ యూనివర్శిటీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా తెలిపారు

ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు విదేశీ చదువుల కోసం ఉచిత శిక్షణ

హైదరాబాద్: విదేశీ యూనివర్శిటీ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణా తెలిపారు.విదేశీ యూనివర్శిటీ లలో మాస్టర్స్ అడ్మిషన్లకు నిర్వహించే టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ / జీమ్యాట్ తదితర అర్హత పరీక్షలకు ఉచిత శిక్షణ, సలహాలు అందించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ సుచిత్ర క్రాస్ రోడ్డు సమీపంలో స్టెఫిన్ లీడ్స్  అకాడమీలో ఈ శిక్షణ ఉంటుందన్నారు.


ఈ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసి, విదేశాలలో మాస్టర్స్ చేయాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఆసక్తిగల అభ్యర్థులు సుచిత్ర క్రాస్ రోడ్స్ సమీపంలో వెంకటేశ్వర ఎన్ క్లేవ్ భవనంలో రెండో ఫ్లోర్ లోని స్టెఫిన్ లీడ్స్ అకాడమీలో సంప్రదించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు స్టెఫిన్ లీడ్స్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ వంగూరి బ్రహ్మయ్య  9030463377 నెంబరులో సంప్రదించాలన్నారు.

Updated Date - 2022-06-24T22:54:50+05:30 IST