బ్లాక్‌ కరెన్సీ పేరుతో మోసాలు

ABN , First Publish Date - 2021-12-07T06:07:53+05:30 IST

బ్లాక్‌ కరెన్సీని అమ్ముతా మంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని టూటౌన పోలీసులు అరెస్టుచేశారు.

బ్లాక్‌ కరెన్సీ పేరుతో మోసాలు
స్వాధీనం చేసుకున్న నగదు, నల్ల కాగితాలు, కారు, రసాయనం

ముగ్గురు విక్రేతల అరెస్టు

రూ. 3.8 లక్షల నగదు, కారు, బ్లాక్‌పేపర్‌ స్వాధీనం

గుంతకల్లు, డిసెంబరు 6: బ్లాక్‌ కరెన్సీని అమ్ముతా మంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని టూటౌన పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం ఉదయం గుంతకల్లులోని టూటౌన పోలీసు స్టేషనలో డీఎస్పీ నరసింగప్ప కేసు వివరాలను వెల్లడించారు. బ్లాక్‌ పేపర్‌కు రసాయనం పూస్తే అవి రూ.500 కరెన్సీ నోట్లవుతాయని నమ్మబలికి కర్నూలు జిల్లా కోసిగికి చెందిన డీ నరేశ కుమార్‌,  పీ గోపాలకృష్ణ, నెల్లూరు జిల్లాలోని హెచ్చుపల్లి గ్రామానికి చెందిన కే దొరస్వామిరెడ్డి అలియాస్‌ చెన్నప్పరెడ్డి పట్టణంలో మోసాలకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. నరేశ కుమార్‌ డీ-ఫార్మసీ చదివి అగ్రిగోల్డ్‌ ఏజెంటుగా పని చేశాడన్నారు. ఇతడు కస్టమర్ల నుంచి డిపాజిట్లు కట్టించడమే కాకుండా వారి వద్ద అప్పులు కూడా చేశాడన్నారు. ఆర్థిక ఒత్తిళ్లను తాళలేక అసాంఘిక ముఠాలతో సాన్నిహిత్యం పెం చుకుని అక్రమంగా డబ్బు సంపాదించి అప్పులు తీర్చాలని భావించాడన్నారు. ఈ నేపథ్యంలో నరేశ కుమార్‌కు కే దొరస్వామిరెడ్డి, పీ గోపాలకృష్ణలతో పరి చయం ఏర్పడింది. వీరు రసాయనాన్ని ఉపయోగించి నల్ల కాగితాలను కరెన్సీగా మార్చవచ్చని జనాన్ని నమ్మించారన్నారు. అసలు కరెన్సీకి నల్ల రంగుపూసి రసాయనంతో ఆ నలుపును తొలగించి మోసాలకు పాల్పడ్డారన్నారు. ఈ బ్లాక్‌ కరెన్సీని గోవాలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముద్రించిందని చెబు తూ మోసపుచ్చారన్నారు. ఒక ఒరిజినల్‌ నోటుకు నాలుగు బ్లాక్‌ కరెన్సీ కాగితాలను ఇస్తామని తెలిపి వారికి ఎందుకూ పనికిరాని నల్ల కాగితాలను అంటగట్టి వారి నుంచి డబ్బును దోచుకున్నారన్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు పట్టణంలోని టీవీ స్టేషన వద్ద కాపుగాచి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీ ఎస్పీ తెలియజేశారు. వారి నుంచి రూ.3.80 లక్షల నగదు, ఓ కారు, 38 బ్లాక్‌ పేపర్‌ కట్టలు, మూడు సెల్‌ఫోన్లు, నలుపు రంగు పూసిన మూడు ఒరిజినల్‌ రూ. 500 నోట్ల కట్టలు, రసాయనాన్ని వారి నుంచి స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. కేసును పరిష్క రించడంలో చొరవచూపిన టూటౌన సీఐ చిన్న గోవిందు, ఏఎ్‌సఐ తిరుపాల్‌, పీసీ రామాంజనేయులు, పీసీలు సునీల్‌, రామాంజనేయులు, దూద్‌పీరాను డీఎస్పీ అభినందించారు.




Updated Date - 2021-12-07T06:07:53+05:30 IST