పేటీఎంను పోలిన యాప్‌‌తో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త

ABN , First Publish Date - 2021-04-13T17:07:25+05:30 IST

పేటీఎంను పోలిన యాప్‌తో మోసాలకు పాల్పడుతున్నారని

పేటీఎంను పోలిన యాప్‌‌తో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త

  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరెస్ట్‌ 


హైదరాబాద్/హిమాయత్‌నగర్ ‌: పేటీఎంను పోలిన యాప్‌తో మోసాలకు పాల్పడుతున్నారని ఆ సంస్థ ప్రతినిధులు పెట్టిన కేసులో గుర్‌గావ్‌కు చెందిన రితే‌ష్‌వర్మ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రితేష్‌ 2017లో ‘పేఏటీఎం’ పేరుతో యాప్‌ను రూపొందించాడు. ఆ సమయంలో ‘పేటీఎం’ సంస్థ ప్రతినిధులు కేసు పెట్టడంతో.. యాప్‌ను తీసేశాడు. ఇటీవల తాజాగా పేటీఎం యాప్‌ను పోలిన యాప్‌ ద్వారా మోసాలు జరుగుతున్నాయని పేటీఎం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రితే్‌షవర్మను అదుపులోకి తీసుకున్నారు. 


లాటరీ పేరుతో రూ. 5 లక్షల మోసం

లాటరీలో కారు వచ్చిందంటూ నగరానికి చెందిన మహిళను నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె నుంచి రూ. 5 లక్షలు కాజేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు సైబర్‌ నేరగాళ్లు కొద్ది రోజుల క్రితం ఫోన్‌ చేశారు. ఆమె ఫోన్‌ నంబర్‌కు లాటరీలో ఖరీదైన కారు వచ్చిందంటూ అభినందనలు తెలిపారు. కారు తీసుకోవాలంటే ప్రాసెసింగ్‌ ఫీజును రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ పెట్టారు. ఇది నమ్మిన ఆమె వారు చెప్పిన ఖాతాలో డబ్బు జమచేసింది. కారు రాకపోవడం, ఫోన్‌ నంబర్లు స్విచ్చాఫ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని మోసం చేసిన అజయ్‌ ఓఝా, సతీష్‌ వర్మను చత్తీ్‌సఘడ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2021-04-13T17:07:25+05:30 IST