TS News: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.96 లక్షల మోసం..

ABN , First Publish Date - 2022-08-12T02:00:03+05:30 IST

Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ. 96 లక్షలు మోసం చేశారు. క్రిప్టో కరెన్సీ‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని సైబర్ కేటుగాళ్ళు బాధితుడిని నమ్మించారు. వాట్సప్ గ్రూప్ ద్వారా

TS News: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.96 లక్షల మోసం..

Hyderabad: క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ. 96 లక్షలు మోసం చేశారు. క్రిప్టో కరెన్సీ‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అధిక లాభాలు వస్తాయని సైబర్ కేటుగాళ్ళు బాధితుడిని నమ్మించారు. వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయం చేసుకుని మొదట బాధితుడికి లాభాలు చూపించారు. తాము పంపించిన యాప్ ద్వారా ట్రేడింగ్ చేస్తే ఇంకా లాభాలు వస్తాయని నమ్మించడంతో బాధితుడు లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బు తీసుకోడానికి కమిషన్, చార్జీలు పేరుతో రూ. 96 లక్షలు కాజేశారు. విషయం గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-12T02:00:03+05:30 IST