ఓటీఎస్‌ పేరుతో మోసం

ABN , First Publish Date - 2021-12-07T04:48:14+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి విమర్శించారు.

ఓటీఎస్‌ పేరుతో మోసం
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిప్రతం సమర్పిస్తున్న బీసీ జనార్దనరెడ్డి

  1.  ప్రజలను పీడిస్తున్న వైసీపీ ప్రభుత్వం 
  2.  టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితమే: మాజీ ఎమ్మెల్యే బీసీ 


బనగానపల్లె, డిసెంబరు 6:  ఓటీఎస్‌ పేరుతో ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని అవుకు మెట్ట వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహనికి బీసీతో పాటు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వైసీపీ ప్రభుత్వం వనటైం సెటిల్‌మెంట్‌ పేరుతో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పేదల ఇళ్లను వనటైం సెటిల్‌మెంట్‌ ద్వారా రూ.10వేలు చెల్లిస్తే రిజిస్ర్టేషన చేస్తామంటూ పేద ప్రజలను పీడిస్తున్నారని, పేదల హక్కులను కాపాడాలని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీసీ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, డీజల్‌, ప్రెటోల్‌ ధరలు, ఇతర వస్తువల ధరలు పెంచి ప్రజలపై భారం వేశారన్నారు. గత ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు రూ.10వేలు చెల్లించాలని ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఓవైపు చెబుతూ మరోవైపు ధరలు పెండచం అన్యాయమన్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పేదల ఇళ్లకు రిజిస్ట్రేషనలు చేసి ఇస్తామని బీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన, బురానుద్దీన, టిప్‌టాప్‌ కలాం, ఖాశీం, అల్తా్‌పహుస్సేన, బొబ్బల గోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డి, పవనకుమార్‌రెడ్డి, ఖాదర్‌, రాయలసీమ సలాం, ఖాజాహుస్సేన, శరతకుమార్‌రెడ్డి, ఎల్లయ్య,  ఖాన,  షబ్బీర్‌, హర్షద్‌, మిట్టపల్లెసుబ్బారెడ్డి పాల్గొన్నారు.  

నందికొట్కూరు: వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఓటీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఆ పార్టీ నాయకులు మహేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, జయసూరి మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో నిర్మించిన ఇళ్లకు హక్కులు కల్పిస్తామని ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయ డం దారుణమన్నారు.  టీడీపీ అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయిస్తామని తెలిపారు. నాయకులు మద్దిలేటి, వేణు, ముర్తుజావలి పాల్గొన్నారు. 





Updated Date - 2021-12-07T04:48:14+05:30 IST