మసీదులో రాడికల్ ప్రసంగాలు... ఫ్రాన్స్ ప్రభుత్వం కఠిన చర్యలు...

ABN , First Publish Date - 2021-12-29T18:26:44+05:30 IST

పవిత్ర యుద్ధం (జీహాద్)కు మద్దతుగా రాడికల్ ప్రసంగాలు, మతపరమైన బోధనలు

మసీదులో రాడికల్ ప్రసంగాలు... ఫ్రాన్స్ ప్రభుత్వం కఠిన చర్యలు...

పారిస్ : పవిత్ర యుద్ధం (జీహాద్)కు మద్దతుగా రాడికల్ ప్రసంగాలు, మతపరమైన బోధనలు చేయడంతో ఓ మసీదును ఫ్రాన్స్ ప్రభుత్వం మూసేసింది. ఆరు నెలలపాటు దీనిని తెరవకూడదని ఆదేశించింది. ఉగ్రవాదం, తీవ్రవాదాలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఇస్లామిక్ ప్రార్థనా స్థలాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. 


ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ, బ్రిటిష్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఉన్న బోవేలో ఓ మసీదు ఉంది. ఇక్కడకు వచ్చే ముస్లింలకు ఇమామ్ మతపరమైన బోధనలు చేస్తున్నారు. జీహాద్‌కు పాల్పడేవారిని హీరోలుగా కీర్తిస్తూ, హింసను రెచ్చగొడుతున్నారు. ఈ ఇమామ్ క్రమం తప్పకుండా మతపరమైన బోధనలు చేస్తున్నప్పటికీ, తాను అప్పుడప్పుడూ ప్రసంగించే వక్తనని చెప్పుకుంటున్నారు. దేశంలోని చట్టాల కన్నా ఇస్లాం ఆచరణకే పెద్ద పీట వేయాలని, ఇస్లాం నిబంధనలే అన్నిటికన్నా గొప్పవని చెప్తున్నారు. 


బోవే మసుదును మూసివేసే ప్రక్రియను అంతకు ముందు ఫ్రాన్స్ హోం మంత్రి గెరాల్డ్ డర్మనిన్ ప్రారంభించారు. క్రైస్తవులు, స్వలింగ సంపర్కులు, యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ మసీదులో రాడికల్ బోధనలు చేస్తున్నారని ఆరోపించారు. 


Updated Date - 2021-12-29T18:26:44+05:30 IST