80 టన్నుల బంగారం అక్కడే ఉందా?

ABN , First Publish Date - 2020-09-14T23:18:01+05:30 IST

80 టన్నుల బంగారం అక్కడే ఉందా?

80 టన్నుల బంగారం అక్కడే ఉందా?

ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 1812లో మాస్కో నుంచి పారిపోయే సందర్భంలో కొల్లగొట్టిన టన్నుల కొద్దీ బంగారం రహస్యం తనకు తెలుసు అంటూ రష్యాకు చెందిన చరిత్రకారుడు ఒకరు కొత్త కథనాన్ని వినిపిస్తున్నారు. 200 ఏళ్లుగా ట్రెజర్‌ హంటర్స్ దీనికోసం వెతుకుతున్నా ఎవరూ సరైన ప్రాంతంలో వెతకడంలేదని ఆయన అంటున్నారు. బంగారం కావాలంటే బెళారస్ సరిహద్దుల్లో ఉన్న తన స్వస్థలం రుజణ్యాకు సమీపంలోని బోల్డ్‌షయ్యా రుటాబీస్ చెరువులో వెతకాలని వయా చెస్‌లవ్ రైజ్‌కౌ అనే చరిత్రకారుడు సూచించారు. నెపోలియన్ సైన్యంలో కొంతభాగం మాత్రమే ఫ్రాన్స్ తిరిగి వెళ్లగలిగింది. 200 ఏళ్ల క్రితం నెపోలియన్ సైన్యం మాస్కో‌ను లూటీ చేసి ఫ్రాన్స్ పారిపోయేటప్పుడు 80 టన్నుల బంగారం ఇతర విలువైన వస్తువులను దోచుకుంది. అయితే తిరిగి వెళ్లడం కష్టం కావడంతో 400 బండ్లలో ఆ నిధిని ఒక చోట దాచి పెట్టారని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 


Updated Date - 2020-09-14T23:18:01+05:30 IST