విద్యార్థుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా

ABN , First Publish Date - 2020-12-04T06:16:52+05:30 IST

పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఏటా లక్షల రూపాయలు దోపిడీ అవుతోంది. ఉన్న త చదువులు చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌ ఇస్తోంది.

విద్యార్థుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా

డబుల్‌ ఎంట్రీతో దోచుకుంటున్న వైనం

ప్రశ్నించిన విద్యార్థులపై వేధింపులు

తెలిసినా పట్టించుకోని యంత్రాంగం

సంక్షేమ, వర్సిటీ, ప్రైవేటు కళాశాల

 యాజమాన్యంపై అనుమానాలు


అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 3: పేద విద్యార్థుల చదువుకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఏటా లక్షల రూపాయలు దోపిడీ అవుతోంది. ఉన్న త చదువులు చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌ ఇస్తోంది. ఉపకారవేతనాలను ప్రస్తుతం నేరుగా విద్యార్థుల ఖాతాలకు జమ చేస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న ఆయా కళాశాలలు విద్యార్థుల పేర్లను డబుల్‌ ఎంట్రీ చేసి సొ మ్ము చేసుకుంటున్నాయి. ఇదంతా యూనివర్సిటీ, సంక్షేమశాఖల అధికారులకు తెలిసినా ఆమ్యమ్యా లు పుచ్చుకుని వంత పాడుతున్నారు. 2012లో జి ల్లా కేంద్రంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌, సత్యసా యి, ఆర్ట్స్‌ కళాశాలతో పాటు పలు కళాశాలలకు చెందిన వి ద్యార్థుల ఏటీఎం కార్డులను తీసుకుని సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది డ్రా చేసుకున్న సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. దీంతో గిరిజన సంక్షేమశాఖకు సంబంధించి ఓ నోడల్‌ ఆఫీసర్‌, సాం ఘిక సంక్షేమ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది, బీసీ సంక్షేమశాఖకు చెందిన ఓ అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతేడాది ఎస్‌ఎ్‌సబీఎన్‌ కళాశాలలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు దారిమళ్లించిన సంఘటనతో సంక్షేమశాఖల అధికారులు రూ.49లక్షలు నిధులు రికవరీ చేశారు. ఉరవకొండకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది సుమారు రూ.80లక్షల వరకు విద్యార్థుల ఫీజులు, ఉపకార వేతనాలు దుర్వినియోగం చేసిన ఘటన  ఆరు నెలల కిందట బట్టబయలైంది. ఇలాంటి ఉ దాహరణలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన సమయంలో లంచాలు ఎవరు ముందుగా అందజేస్తారో.. సంబంధిత కళాశాలకు నిధులు ఇస్తున్నట్టు ఆయా అధికారులపై ఆరోపణలున్నాయి.


 పట్టించుకోని యంత్రాంగం

ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌ నిధుల దుర్వినియోగంపై అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకు లు అనేక దఫాలుగా జిల్లా యంత్రాంగానికి ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదు. ఇటీవల తాడిపత్రిలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో జరిగిన అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా యాజమాన్యం అడ్డుకుంది. బాధిత వి ద్యార్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలి తం లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న 500కు పైగా కళా శాలలో ప్రతి ఏటా లక్షదాకా విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో రూ.250 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇందులో వివిధ స్థాయిల్లో అక్రమాలకు తెరతీశారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.


మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం :  యుగంధర్‌, డీడీ, బీసీ సంక్షేమ శాఖ 

విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల చెల్లింపుల్లో అవినీతి జరిగినట్టు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఇటీవల తాడిపత్రిలోని ఇంజినీరిం గ్‌ కళాశాలలో జరిగిన వాటిపై విచారణ చేశాం. ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థుల పేర్ల నమోదులో తప్పులను గుర్తించాం. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరిగినా స హించేది లేదు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడుతాం.




Updated Date - 2020-12-04T06:16:52+05:30 IST