భారత్‌లో ఫాక్స్‌కాన్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడులు!

ABN , First Publish Date - 2020-07-12T06:21:31+05:30 IST

భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్న తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోం ది. దాదాపు రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని...

భారత్‌లో ఫాక్స్‌కాన్‌ రూ.7,500 కోట్ల పెట్టుబడులు!

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ ఐఫోన్లను తయారు చేస్తున్న తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఫాక్స్‌కాన్‌ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోం ది. దాదాపు రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌ ప్లాంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ప్లాంట్‌ సామర్థ్యాలను పెంచాలని భావిస్తోంది.


చైనాలో ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్‌ భావిస్తుండటంతో ఫాక్స్‌కాన్‌ దీన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో భారత్‌లో ఈ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్యపరమైన వివాదాలు తీవ్రమవుతుండటమే కాకుండా అక్క డ ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో యాపిల్‌ క్లయిం ట్ల నుంచి కూడా ఇదే తరహా అభ్యర్ధనలు వచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌ ప్లాంట్‌లో ఫాక్స్‌కాన్‌.. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు కొన్ని ఐఫోన్‌ మోడళ్లను ఫాక్స్‌కాన్‌.. చైనాలో ఉత్ప త్తి చేస్తోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ మోడళ్లను భారత్‌లో ఫాక్స్‌కాన్‌ ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. 


Updated Date - 2020-07-12T06:21:31+05:30 IST