అనురాగం నక్క బతుకు!

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

ఒక అడవిలో యువ సింహం ఉండేది. అడవికి తానే రాజు అవ్వాలని.. అడవిని బాగా పరిపాలించాలనే కోరిక ఉండేది.

అనురాగం నక్క బతుకు!

ఒక అడవిలో యువ సింహం ఉండేది. అడవికి తానే రాజు అవ్వాలని.. అడవిని బాగా పరిపాలించాలనే కోరిక ఉండేది. ఆశతో పాటు మంచి గుణాలుండే సింహమది. అడవిలో రాజు కావటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. ఒకరోజు నక్క తన గుహకు వచ్చింది. ఆ తర్వాత ప్రతి రోజు గుహ చుట్టూ చక్కర్లు కొట్టేది. ఒక రోజు సింహంతో ‘నేను మంచి ఉపాయాలు చెబుతా. అందరి కథలు తెలుసు. నా తెలివితేటలు ఎవరికీ లేవు. నీ దగ్గర ఉండి. నిన్ను రాజుగా చూడాలన్నదే నా కోరిక’ అన్నది. సింహం కాస్త ఆలోచించింది. వెంటనే నక్క ఇలా అన్నది... సింహంగారు.. మీరు తినే దాంట్లో కొంత పెట్టండి. మీ వ్యవహారాలు చూసుకుంటానంది. ‘మన దగ్గర ఇలాంటి జిత్తులమారి ఉండటం మంచిదే’ అనుకుంది సింహం. అనుకున్నట్లే యువ సింహం తన సత్తాతో, ప్రతిభతో, అదృష్టంతో అడవికి రాజైంది. 


రాజుగారు మనకు క్లోజ్‌. నేను చేసిన వ్యూహాలే సింహం రాజు కావటానికి కారణమంటూ.. అడవిలోని మిగతా పులులకు, బ్లాక్‌ఫాంథర్లకు నక్క రహస్యంగా చెప్పడం ప్రారంభించింది. ఈ విషయం చిలుకలద్వారా, కాకుల ద్వారా సమాచారం రాబట్టుకుంది యువరాజు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు తనకు అనుకూలంగా ఉండే అనేక విషయాలు రాజుగారితో చెప్పేది. రాజు బలంతో బయట పరపతి పెంచుకుంది. ఒక దశలో నేను లేకుంటే రాజే లేదనుకుంది. ‘నేనే రాజు’ అనుకుంది. యువ రాజుకు తెలీకుండా అడవిలోని ఇతర సింహాలతో, పులులతో రహస్యంగా మాట్లాడేది. రాజు విషయాలన్నీ చెప్పేది. ఈ విషయం యువరాజుకి తెలిసింది. ఎంతో ప్రేమగా.. అనురాగంతో నక్కను ఇంటికి పిలిచింది. ఎంతో వినయంగా, అనురాగం కురిపిస్తూ ఎప్పటిలానే భజన చేస్తూ గుహకు నక్క వెళ్లింది. మాట్లాడుతూ దగ్గరకు వెళ్లి.. ఒక్క ఉదుటున నక్క గొంతు కొరికేసింది సింహం.

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST