Abn logo
Dec 3 2020 @ 09:40AM

బురేవీ తుపాన్...14 ఎన్డీఆర్ఎఫ్ బ‌ృందాల మోహరింపు

న్యూఢిల్లీ : బురేవి తుపాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 14 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సు బృందాలను కేంద్రప్రభుత్వం మోహరించింది. కన్యాకుమారి, నాగపట్నం, రామనాథపురం, తిరునెల్వేలి, మధురై, కడలూరు ప్రాంతాల్లో తుపాన్ ముప్పు దృష్ట్యా తమిళనాడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందాలను పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ జవాన్లను తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. బురేవి తుపాన్ వల్ల దక్షిణ తమిళనాడు, కేరళ దక్షిణ తీరప్రాంతాల్లో భారీ వర్సాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు దక్షిణ తీరంలోని పంబన్, కన్యాకుమారి ప్రాంతాల చేరువగా తీరం దాటవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement