Mexicoలో హెలికాప్టర్ crash...14మంది మృతి

ABN , First Publish Date - 2022-07-16T14:34:09+05:30 IST

మెక్సికో దేశంలో హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో 14 మంది మరణించారు....

Mexicoలో హెలికాప్టర్ crash...14మంది మృతి

మెక్సికో సిటీ: మెక్సికో దేశంలో హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో 14 మంది మరణించారు.వాయువ్య మెక్సికోలో శుక్రవారం సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో 14 మంది మరణించారని నావికాదళం తెలిపింది.బ్లాక్ హాక్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం ప్రస్తుతానికి తెలియదని మెక్సికో నేవి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.సినలోవా రాష్ట్రంలో ప్రమాదం జరిగినపుడు హెలికాప్టరులో 15 మంది ప్రయాణిస్తున్నారని, వారిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి వైద్య చికిత్స పొందుతున్నారని నావికాదళం పేర్కొంది.హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని నేవి ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మరణానికి నావికాదళం సంతాపం తెలిపింది. యూఎస్ అండర్‌కవర్ ఏజెంట్‌ను హత్య చేసినందుకు యునైటెడ్ స్టేట్స్ కోరిన పేరుమోసిన డ్రగ్ కింగ్‌పిన్ ను శుక్రవారం పట్టుకున్న ఘటనకు ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధం లేదని నమ్ముతున్నట్లు నావికాదళం తెలిపింది.



Updated Date - 2022-07-16T14:34:09+05:30 IST