వైద్యం వికటించి చిన్నారి మృతి!

ABN , First Publish Date - 2021-09-19T05:02:15+05:30 IST

గోకవరం, సెప్టెంబరు 18: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వైద్యం వికటించి నాలుగేళ్ల చిన్నారి శనివారం మృతిచెందినట్టు తెలిసింది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్‌ ఆసుసపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుడు చేసిన చికిత్స వికటించి ఆ చిన్నారి

వైద్యం వికటించి చిన్నారి మృతి!

గోకవరం, సెప్టెంబరు 18: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో వైద్యం వికటించి నాలుగేళ్ల చిన్నారి శనివారం మృతిచెందినట్టు తెలిసింది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్‌ ఆసుసపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుడు చేసిన చికిత్స వికటించి ఆ చిన్నారి మృతిచెందినట్టు తల్లిదండ్రులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. గ్రామపెద్దలు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా హామీఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించుకున్నట్టు తెలిసింది.

Updated Date - 2021-09-19T05:02:15+05:30 IST