అమరావతి: రాజ్యసభకు నలుగురు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ANDHRA PRADESH CHIEF MINISTER జగన్ మెహన్ రెడ్డితో భేటీ తర్వాత అభ్యర్థులను మంత్రి బొత్స ప్రకటించారు. రాజ్యసభ సీటు కాదు.. తెలంగాణ, ఏపీ అనే తేడా లేదని బొత్స అన్నారు. రాజ్యసభకు ఎవరిని పంపుతున్నామనేదే ముఖ్యమని బొత్స తెలిపారు. గతంలో ఎప్పుడూ బీసీలకు అవకాశం ఇవ్వలేదని, నాలుగులో సగం స్థానాలు బలహీనవర్గాలకే ఇచ్చామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి