ఐఏబీకి నలుగురే

ABN , First Publish Date - 2022-05-20T06:10:41+05:30 IST

జిల్లాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన నీటి పారుదల అభివృద్ధి సలహా మండలి (ఐఏబీ) సమావేశానికి నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఐఏబీకి నలుగురే

  1. ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా  
  2. సాదాసీదాగా సమావేశం 
  3. జలాశయాలకు వరద వస్తేనే       
  4.  ఆయకట్టుకు నీరు 


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 19:  జిల్లాలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలకు సంబంధించిన నీటి పారుదల అభివృద్ధి సలహా మండలి (ఐఏబీ) సమావేశానికి నలుగురు  ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముగ్గురు  వివిధ కారణాలతో డుమ్మా కొట్టారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డా.జె. సుధాకర్‌తో పాటు జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. గురువారం  కలెక్టర్‌ కాన్ఫరెన్స హాల్లో జరిగిన ఐఏబీ సమావేశానికి జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో   తుంగభద్ర దిగువ కాలువ కింద నీటి లభ్యత ఆధారంగా జూన 25వ తేదీ నుంచి జూలై 8వ తేదీ మధ్యన నీరు విడుదల చేయాలని ప్రతిపాదనలు చేశారు.   జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య  హంద్రీనీవా కాలువ ద్వారా 35వేల ఎకరాలకు సాగునీరు అందించేలా మరో ప్రతిపాదన చేశారు.  నీటి లభ్యతను బట్టి కర్నూలు, కడప కాలువలకు, జూన 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యన 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు చేశారు. హంద్రీనీవా కాలువ ద్వారా 37,500 ఎకరాలకు,  కేసీ కెనాల్‌ కింద   1.75 లక్షల ఎకరాలకు నీరందించాలని  నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఏయే  ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు ఏ సమయంలో నీరు వదలాలనే విషయం చర్చించి  ప్రణాళికను సిద్ధ్దం చేస్తామని ప్రకటించారు.  గాజులదిన్నె ప్రాజెక్టు సామ ర్థ్యం పెంపు పనులు వేగవంతంగా జరగాలని, ప్రతి రోజూ చేయాల్సిన పనులను టార్గెట్‌ను పెట్టుకుని   పర్యవేక్షించాలని ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ  సుం కేసుల ఎగువన గుండ్రేవుల రిజర్వాయ రును నిర్మిస్తే.. కరువును పూర్తిగా నిర్మూలిం చవచ్చని అన్నారు.   కోడు మూరు ఎమ్మె ల్యే సుధాకర్‌ మాట్లాడుతూ కేసీ కెనాల్‌లో వృథా అవుతున్న నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, లిఫ్టు స్కీమ్‌లకు వెంటనే మరమ్మతులు చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్‌ ఆయకట్టును స్టెబిలైజ్‌ చేయడానికి అత్యవసరంగా గుండ్రేవుల రిజర్వా యరును  నిర్మించాలని అన్నారు.  త్వరగా హంద్రీనీవా 27, 28, 29 ప్యాకేజీలల్లో పనులు పూర్తి చేసి మిగిలిన ఆయకట్టుకు నీరందించాలని కోరారు. 

  మంత్రాలయం, ఆదోని ఎమ్మె ల్యేలు బాలనా గిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ నియోజక వర్గాల్లో పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం  గురించి  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా లన్నారు. ఈ ఈ సమావేశంలో జేసీ రామసుందర్‌ రెడ్డి, ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, హెచఎనఎస్‌ఎస్‌ ఎస్‌ఈ నాగరాజు, డీఆర్‌వో నాగేశ్వ రరావు  పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T06:10:41+05:30 IST