గుంటూరు మీదగా నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లు.. ట్రైన్ నంబర్లు, టైమింగ్స్ ఇవే..!

ABN , First Publish Date - 2022-09-29T21:12:11+05:30 IST

ప్రయాణీకుల రద్దీని తొలగించేందుకు గుంటూరు మీదగా నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజన్‌ రైల్వే అధికారి మంగళవారం ఒక ప్రకటనలో..

గుంటూరు మీదగా నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లు.. ట్రైన్ నంబర్లు, టైమింగ్స్ ఇవే..!

గుంటూరు (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీని తొలగించేందుకు గుంటూరు మీదగా నాలుగు వీక్లీ ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజన్‌ రైల్వే అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 08579 విశాఖపట్టణం - సికింద్రాబాద్‌ రైలు అక్టోబరు నెలలో ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.35కి గుంటూరు, గురువారం ఉదయం 8.20కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. నెంబరు. 08580 సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం రైలు అక్టోబరు నెలలో ప్రతీ గురువారం రాత్రి 7.40కి బయలుదేరి 11.45కి గుంటూరు, శుక్రవారం ఉదయం 6.40కి విశాఖపట్టణం చేరుకొంటుంది. నెంబరు. 08585 విశాఖపట్టణం - మహబూబ్‌నగర్‌ రైలు అక్టోబరు నెలలో ప్రతీ మంగళవారం సాయంత్రం 5.35కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 12.40కి గుంటూరు బుధవారం ఉదయం 10.30కి మహబూబ్‌నగర్‌ చేరుకొంటుంది.


నెంబరు. 08586 మహబూబ్‌నగర్‌ - విశాఖపట్టణం రైలు అక్టోబరు నెలలో ప్రతీ బుధవారం సాయంత్రం 6.20కి బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.25కి గుంటూరు, గురువారం ఉదయం 9.50కి విశాఖపట్టణం చేరుకొంటుంది. ఈ నాలుగు రైళ్లకు గుంటూరుతో పాటు సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండలో నిలుపుదల సౌకర్యం కల్పించారు.

Updated Date - 2022-09-29T21:12:11+05:30 IST