నాలుగు సెషన్లు... రూ. 1,300 కోట్లు

ABN , First Publish Date - 2021-10-17T23:43:16+05:30 IST

ముందుచూపు., విశ్వాసం., మార్కెట్ పట్ల అవగాహన., అన్నింటికీ మంచి అనుభవం కలిసి నాలుగు రోజుల్లో రూ. 1331 కోట్లు సంపాదించిపెట్టాయి. ఇది పాధ్యమేనా ? అదే సందేహమొస్తే... ఈ కథనం చదవండి.

నాలుగు సెషన్లు... రూ. 1,300 కోట్లు

ముంబై : ముందుచూపు., విశ్వాసం., మార్కెట్ పట్ల అవగాహన., అన్నింటికీ మంచి అనుభవం కలిసి నాలుగు రోజుల్లో రూ. 1331 కోట్లు   సంపాదించిపెట్టాయి. ఇది పాధ్యమేనా ? అదే సందేహమొస్తే... ఈ కథనం చదవండి. స్టాక్ మార్కెట్ తో సాధ్యపడిన విషయమిది. ప్రముఖ ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్ వాలా గడిచినవారం మార్కెట్‌లో ఉన్న నాలుగు సెషన్లలో కేవలం రెండు కంపెనీల స్టాక్స్ ద్వారానే ఏకంగా రూ. 1,331 కోట్లు సంపాదించి చరిత్ర సృష్టించారు.


టాటా మోటర్స్ కంపెనీ షేరు గడిచినవారం దాదాపు 30 శాతం వరకూ పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రాకేష్  పెట్టుబడి విలువ రూ. 1445 కోట్లు. మొత్తం 3.77 కోట్ల షేర్లున్నాయి. మొన్న గురువారం నాటికి కంపెనీ స్టాక్ భారీగా పెరిగింది. టాటా మోటర్స్ లో ప్రస్తుతం రాకేష్ షేర్ల విలువ  రూ. 1,874 కోట్లుగా ఉంది. అంటే వారం రోజుల్లో ఆయన   లాభం రూ. 429 కోట్లు. కంపెనీ షేరు ఈ ఏడాది దాదాపు 167శాతం పెరిగింది.


టైటన్ షేర్లలో...

టైటన్ కంపెనీ షేరు కూడా గడిచిన వారంలో భారీగా పెరిగింది. ఇందులో రాకేష్ కుటుంబానికి 4.26 కోట్ల షేర్లున్నాయి. అంటే మొత్తం 4.81 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీలో విలువ  రూ. 10,046 కోట్లుగా ఉంది. షేరు 8.98 శాతం పెరిగింది. షేరు రూ. 2567 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసేనాటికి వాళ్ల వాటా వాల్యూ రూ. 10,948 కోట్లుగా ఉంది. అంటే రూ. 902 కోట్లు పెరిగింది. టైటన్ షేరు ఈ సంవత్సరం ఇప్పటివరకు  64.7 శాతం లబ్ది పొందింది.

Updated Date - 2021-10-17T23:43:16+05:30 IST