ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రోహింగ్యాల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-19T12:02:09+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమంగా నివాసముంటున్న నలుగురు రోహింగ్యా ముస్లింలను యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది....

ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రోహింగ్యాల అరెస్ట్

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమంగా నివాసముంటున్న నలుగురు రోహింగ్యా ముస్లింలను యూపీ యాంటీ టెర్రరిస్ట్  స్క్వాడ్ అరెస్ట్ చేసింది. రోహింగ్యా ముస్లింలైన హాఫిజ్ షఫీఖ్, అజీజుర్ రెహమాన్, ముఫిజుర్ రెహమాన్, ముహ్మద్ ఇస్మాయిల్ లు యూపీలోని మీరట్ నగరంలో అక్రమంగా నివాసముండగా, వారిని అరెస్టు చేశామని యూపీ ఏటీఎస్ ప్రతినిధి చెప్పారు.అక్రమంగా నివాసముంటున్న రోహింగ్యా ముస్లింలకు ఫోర్జరీ చేసిన పత్రాలు అందించిన ముఠా గుట్టును ఏటీఎస్ అధికారులు రట్టు చేశారు. రోహింగ్యాల వద్ద నుంచి గుర్తింపు కార్డులు, పాస్ పోర్టులు, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, విదేశీ కరెన్సీ లభించాయి. 


విదేశీయులు అక్రమంగా రావడంతో  మన దేశంలో జనాభా పెరిగి పోతున్నారని, హవాలా మార్గంలో ఆర్థిక లావాదేవీలు కూడా సాగుతున్నాయని యూపీ లా అండ్ ఆర్డర్  ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. రోహింగ్యాలకు పీఎఫ్ఐ తో సంబంధాలున్నాయని తేలిందని ఏడీజీ చెప్పారు.గురువారం కూడా మరో ఇద్దరు రోహింగ్యాలను అలీఘడ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి 6 బంగారు బిస్కెట్లు, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.మయన్మార్ నుంచి వచ్చి అలీఘడ్, కాన్పూర్, ఉన్నవో ప్రాంతాల్లో రోహింగ్యాలు నివాసముంటున్నారని యూపీ పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-06-19T12:02:09+05:30 IST