నలుగురు దొంగల అరెస్టు: డీసీపీ జోయెల్ డెవీస్

ABN , First Publish Date - 2022-02-26T22:26:29+05:30 IST

నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ

నలుగురు దొంగల అరెస్టు:  డీసీపీ జోయెల్ డెవీస్

 హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ జోయెల్ డెవీస్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇండ్లలో చోరీలకు పాల్పదుతున్న నలుగురు నిందితులను అదపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల నుంచి 50 తులాల బంగారు ఆభరణాలు, 10,000/- నగదు, ఓ ద్విచక్ర వాహనం డియో బైక్, మొత్తం రూ.  26 లక్షలు సొత్తును సీజ్ చేసామన్నారు. మంగల్‌హట్, హుమాయున్ నగర్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నిందితులు దొంగతనాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. పట్టుబడిన వారిలో ఇద్దరు బాలురు, ఇద్దరు యువకులు ఉన్నారన్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వారిపై హుమాయున్ నగర్ పోలీసులు నిఘా పెట్టారన్నారు. ఆసిఫ్ నగర్ డివిజన్, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా నిందితులను పట్టుకున్నారని ఆయన తెలిపారు. వీరిలో ఇద్దరు పేరుమోసిన ఇంటి దొంగలు ఉన్నారన్నారు.  


సయ్యద్ ఇర్ఫాన్ పాషా అబ్దుల్ రెహమాన్, సయ్యద్ అలీ హుజాఫాలను రిమాండ్ తరలించామన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు  బాలబాలికలను అరెస్ట్ చేసి జ్యువైనల్ హోమ్‌కు తరలించామని ఆయన పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం నిందితుడు సయ్యద్ ఇర్ఫాన్ పాషా @ అబ్దుల్ రెహమాన్ @ రెహమాన్ మరియు సయ్యద్ అలీ హుజాఫా @ అలీ వారి కామన్ ఫ్రెండ్ అయిన బాలుడు జువెనైల్ ద్వారా స్నేహితులు అయ్యారన్నారు. బాలుడు తన స్నేహితులను (ఇద్దరు బాలబాలికలు) మిగిలిన నిందితులకు పరిచయం చేశాడని ఆయన తెలిపారు. అందరూ ఒకరితో ఒకరు స్నేహాన్ని పెంచుకున్నారన్నారు. నిందితులు, బాలబాలికలు ఈ ప్రాంతంలో తరచుగా కలుసుకునేవారన్నారు. వారు సిగరెట్ తాగడం, మద్యం సేవించడం, హుక్కా వంటి చెడు దుర్గుణాలకు అలవాటు పడ్డారన్నారు. నిందితులు సయ్యద్ ఇర్ఫాన్ పాషా @ అబ్దుల్ రెహమాన్ @ రెహమాన్ మరియు సయ్యద్  విలాసవంతమైన జీవితం కోసం హైదరాబాద్‌లో ఇళ్లలో చోరీలు చేయాలని ప్లాన్ చేసి, ఇంట్లో చోరీలు చేయడంలో తమకు సహకరించాలని బాలబాలికలను కోరాడని డీసీపీ తెలిపారు.


Updated Date - 2022-02-26T22:26:29+05:30 IST