నలుగురు దొంగల అరెస్టు: సీపీ

ABN , First Publish Date - 2022-01-28T06:53:54+05:30 IST

జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనా లు చేసిన నలుగురు దొంగలను రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి, సుమారు 5 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. గురువారం సీపీ కార్యాలయంలో విలేకరులకు సమావేశంలో వివరాలను వెల్లడించారు.

నలుగురు దొంగల అరెస్టు: సీపీ

ఖిల్లా, జనవరి 27: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనా లు చేసిన నలుగురు దొంగలను రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి, సుమారు 5 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. గురువారం సీపీ కార్యాలయంలో విలేకరులకు సమావేశంలో వివరాలను వెల్లడించారు. రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మారూతినగర్‌లో గురువారం ఉదయం పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వెళుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి నుంచి సరైన సమాచారం రాలేదు. దీంతో తీసుకుని విచారించగా కంచి శివప్రసాద్‌, అక్షయ్‌కుమార్‌, ఆనంద్‌కృష్ణ, ప్రేమ్‌ భాస్కరులుగా గుర్తించామన్నారు. మహారాష్ట్రకు చెంది న వారని, ఒక్కొక్కరుగా జిల్లాకేంద్రానికి చేరుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు శివ ప్రసాద్‌ తన నానమ్మతో చిన్నపాటి హోటల్‌ను ప్రారంభించాడన్నారు. హోటల్‌ను సాకుగా చేసుకున్న వీరు నగరంలోని శివారు ప్రాంతాల్లో ఉదయం పూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి దొంగతనాలు చేసేవారన్నారు. ఈనెల 24న మధ్యాహ్నం గంగాస్థాన్‌లోని ఓ అపార్ట్‌మెంటులో దొంగతనం చేసి, అదే అపార్ట్‌మెంటులో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లో తాళం పగుల కొడుతుండగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వ్యక్తులు గమనించి కేకలు వేయగా పారి పోయారని చెప్పారు.   సుమారు 4తులాల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, లక్షా30వేల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. నిందితులను పట్టుకున్న అదనపు డీసీపీ అరవింద్‌బాబు, నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, సౌత్‌ రూరల్‌ సీఐ జే.నరేష్‌, రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రిని అభినందిచారు.

Updated Date - 2022-01-28T06:53:54+05:30 IST