బెంగళూరు టూ పామూరు

ABN , First Publish Date - 2020-03-27T09:48:18+05:30 IST

జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లిన కార్మికులకు కరోనా కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా పామూరు గ్రామానికి చెందిన

బెంగళూరు టూ పామూరు

420 కిలోమీటర్లు

ద్విచక్రవాహనంపై నలుగురి ప్రయాణం

జీవనోపాధి కోసం వెళ్లిన వారికి కరోనా కష్టాలు


గోపవరం, మార్చి 26: జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లిన కార్మికులకు కరోనా కష్టాలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లా పామూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంటు నిర్మాణంలో కూలిపనులతో జీవనం సాగిస్తోంది. ఈక్రమంలో రోజు రోజుకు కరోనా విస్తరిస్తుండడంతో ఎక్కడిపనులు అక్కడ ఆగిపోయాయి. అపార్ట్‌మెంటు యజమాని సైతం అందరినీ ఎవరి ఊరికి వారు వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. ఎలాంటి రవాణా సదుపా యం లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తమ ద్విచక్రవాహనంపై  స్వగ్రామానికి చేరాలనుకున్నారు. భార్య, భర్త, కొడుకు, కూతురు.. నలుగురూ బుధవారం సాయంత్రం బెంగళూరునుంచి పామూరుకు బయలుదేరారు.


సుమారు 420 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై నలుగురు వ్యక్తులు ప్రయాణించాలంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడా సేద తీరుతూ గురువారం ఉదయం 11 గంటలకు గోపవరం మండలం కడప జిల్లా సరిహద్దుప్రాంతమైన పీపీకుంట చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు.  అక్కడ ఉన్న ఎస్‌ఐ క్రిష్ణయ్య వారిని ఆపి వివరాలు కనుక్కుని జాగ్రత్తగా చేరాలని చెబుతూ ఊరిలో కూడా 14 రోజులపాటు బయట తిరగకుండా ఉండాలని సూచించారు. పీపీకుంట నుంచి మరో 70 కిలోమీటర్లు ప్రయాణిస్తేగాని వారి స్వస్థలానికి చేరుకోలేరు.

Updated Date - 2020-03-27T09:48:18+05:30 IST