మైగ్రేట్‌.. టెన్షన్‌.. తాజాగా మరో నాలుగు పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-26T21:00:03+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. ముంబై నుంచి జిల్లాకు వచ్చిన నలుగురు వలస కార్మికులకు సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు.

మైగ్రేట్‌.. టెన్షన్‌.. తాజాగా మరో నాలుగు పాజిటివ్‌ కేసులు

ముంబై వలస కార్మికులకు కరోనా

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాజాగా మరో నాలుగు పాజిటివ్‌ కేసులు 

గాంధీ అస్పత్రికి తరలింపు


భూపాలపల్లి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. ముంబై నుంచి జిల్లాకు వచ్చిన నలుగురు వలస కార్మికులకు సోమవారం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  ప్రజలు పరేషాన్‌ అవుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో ఆరు కేసులు న మోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మర్కజ్‌ కేసుల అనంతరం మైగ్రేట్‌ కేసులు తెరపైకి వస్తుండడంతో బాధితులు ఎవరెవరిని కాంటాక్ట్‌ అయ్యారో అధికారులు ఆరా తీస్తున్నారు.  


కరోనా హైరానా..

జిల్లాలో గత మార్చి 13 నుంచి 18 తేదీల మధ్య ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన సింగరేణి కార్మికుడికి కరోనా వైరస్‌ సోకగా అతడి నుంచి ఆయన కూతురు, భార్యకు వ్యాపించింది. దీంతో నెలన్నర పాటు భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలను రెడ్‌ జోన్‌లుగా ప్రకటించి అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టారు. 200 మందికి పైగా అనుమానితుల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌గా తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏప్రిల్‌ 13న కరోనా బాధితులు గాంధీ నుంచి డిశ్చార్జి కాగా  ప్రస్తుతం ముంబాయి వలస కార్మికులకు కరోనా రావడంతో జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది.  


ఒక్కరోజే నాలుగు కేసులు

జిల్లాలోని చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన ఇద్దరు వృద్ధ  దంపతులకు మూడు రోజుల క్రితం కరోనా రావడంతో వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తాజాగా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ మైగ్రేట్‌, ఈ నెల 24న ముంబై నుంచి మొగుళ్లపల్లి మండలం కోర్కిశాలకు వచ్చిన  మరో ముగ్గురికి సోమవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అధికారులు వీరిని హైదరాబాద్‌ గాంధీ అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 


ప్రాథమిక కాంటాక్టులపై ఆరా.. 

చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన ఆరుగు రు కరోనా బాధితులు ముంబైలో ఒకే కంపెనీలో పని చేస్తారు. నవాబుపేటకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, రామచంద్రాపూర్‌కు చెందిన మరొకరు మే 14న ముంబై నుంచి ప్రత్యేక బస్సులో హన్మకొండలోని వడ్డెపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ ఆటోను అద్దె కు తీసుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. భూపాలపల్లి డీఎంహెచ్‌వో గోపాల్‌రావు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌ చేశారు. 22, 23న వృద్ధదంపతులకు కరోనా నిర్ధారణ కాగా, రామచంద్రాపూర్‌కు చెంది న వ్యక్తికి సోమవారం పాజిటివ్‌గా తేలింది. హోం క్వారంటైన్‌లో ఉన్న వృద్ధ దంపతులు రెండు సార్లు నీళ్ల కోసం ఊళ్లోని చేతిపంపు వద్దకు వెళ్లి వచ్చినట్లు  గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మొగుళ్లపల్లి మండలం కొర్కిషాలకు చెందిన ముగ్గురు ముంబై నుంచి రైళ్లో ఈ నెల 23 న కాజీపేటకు అక్కడి నుంచి ఆటోలో హన్మకొండ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో పరకాలకు, అక్కడి నుంచి జమ్మికుంట బస్‌లో మొగుళ్లపల్లికి వచ్చా రు. సర్పంచ్‌ ఆధ్వర్యంలో వీరిని భూపాలపల్లిలోని ప్రభు త్వ క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయగా సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరు రైలు, ఆటో, ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. నవాబుపేట, కొర్కిషాల, మొగుళ్లపల్లిలో అందరికీ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2020-05-26T21:00:03+05:30 IST