హోం క్వారంటైన్ ఉల్లంఘించిన నలుగురిపై పోలీసుల కేసు

ABN , First Publish Date - 2020-03-23T12:20:33+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్నా హోం క్వారంటైన్ లో ఉండాలని జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ఒడిశా పౌరులపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన...

హోం క్వారంటైన్ ఉల్లంఘించిన నలుగురిపై పోలీసుల కేసు

కటక్ (ఒడిశా): కరోనా వైరస్ ప్రబలుతున్నా హోం క్వారంటైన్ లో ఉండాలని జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన నలుగురు ఒడిశా పౌరులపై  పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన కటక్ నగరంలో జరిగింది. పూరీఘాట్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అమెరికా నుంచి తిరిగివచ్చారు. దీంతో వైద్యాధికారులు అతన్ని 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. వైద్యాధికారులు జారీ చేసిన ఆదేశాలను పాటించకుండా ఆ వ్యక్తి మార్కెట్ ప్రాంతాల్లో తిరుగుతున్నాడని వైద్యఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో వైద్యాధికారుల ఫిర్యాదు మేర పోలీసులు తనిఖీలు చేయగా అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి హోం క్వారంటైన్ లో లేరని తేలింది. దీంతో అతనిపై కటక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 188,269,270,271 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతన్ని ఆసుపత్రి క్వారంటైన్ వార్డుకు తరలించారు.


సంబాల్ పూర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఉజ్బెకిస్థాన్ దేశం నుంచి తిరిగి వచ్చారు. ఉజ్బెకిస్థాన్ వ్యక్తి కూడా హోంక్వారంటైన్ లో లేరని తేలడంతో పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 188, 271 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భువనేశ్వర్ నగరానికి చెందిన దంపతులు ఇటీవల విదేశాల నుంచి తిరిగివచ్చారు. వారు హోం క్వారంటైన్ లో ఉండాలనే వైద్యాధికారుల ఆదేశాలను ఉల్లంఘించడంతో వారిని కూడా పోలీసులు భువనేశ్వర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

Updated Date - 2020-03-23T12:20:33+05:30 IST