ఐదేళ్ళలో 4 శాతం జీడీపీ,,, కేంద్రం లక్ష్యం..!

ABN , First Publish Date - 2021-01-20T01:04:27+05:30 IST

ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 7-8 శాతం మధ్య ఉంటుందని భావిస్తున్నారు. వివిధ చర్యలతో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 4 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.

ఐదేళ్ళలో 4 శాతం జీడీపీ,,, కేంద్రం లక్ష్యం..!

న్యూఢిల్లీ :  ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 7-8 శాతం మధ్య ఉంటుందని భావిస్తున్నారు.  వివిధ చర్యలతో 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి దీనిని 4 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం... మధ్యస్థాయి ద్రవ్యలోటు 3 శాతం ఉండవచ్చునని నిర్దేశించారు. అయితే 2014-15 నుండి 2020-21 వరకు ఏ సంవత్సరంలో కూడా ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాంటిది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. 


కరోనా నుండి కోలుకోవాలంటే ప్రజల వద్దకు డబ్బు చేరాలి. ఇక ప్రభుత్వం తన రాబడికి మించి ఖర్చును పెంచగలిగినప్పడే ద్రవ్యలోటు పెరుగుతుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపధ్యంలో ప్రభుత్వం రూ. 30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. బడ్జెట్‌కు ఇది అదనం. ఈ క్రమంలో... బడ్జెట్‌లో నిర్దేశించిన 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో పక్కన పెట్టినట్లైంది.  వచ్చే(2021-22) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కూడా మౌలిక, వైద్య రంగాలపై వ్యయాలు పెరగనున్నాయి. ఇక 2025-26నాటికి మాత్రం బడ్జెట్ లోటు 4 శాతానికి తగ్గేలా చర్యలుండవచ్చని భావిస్తున్నారు. 


Updated Date - 2021-01-20T01:04:27+05:30 IST