వ్యాపారవేత్త ఇంట్లో పెయింట్ వేసేందుకు వెళ్లిన యువకులు.. అక్కడ ఒక రహస్య గదిలో వాళ్లు ఏం చూశారంటే..

ABN , First Publish Date - 2022-04-29T06:00:56+05:30 IST

ఒక బడా వ్యాపారవేత్త ఇంట్లో నుంచి రూ.2.5 కోట్లు విలువైన డబ్బు, బంగారం దొంగతనం జరిగాయి. ఆ దొంగతనం చేసింది నలుగురు యువకులని ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారణ ప్రారంభించి అనుమానితులైన ఆ నలుగరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని దొంగతనం గురించి ప్రశ్నించగా..

వ్యాపారవేత్త ఇంట్లో పెయింట్ వేసేందుకు వెళ్లిన యువకులు.. అక్కడ ఒక రహస్య గదిలో వాళ్లు ఏం చూశారంటే..

ఒక బడా వ్యాపారవేత్త ఇంట్లో నుంచి రూ.2.5 కోట్లు విలువైన డబ్బు, బంగారం దొంగతనం జరిగాయి. ఆ దొంగతనం చేసింది నలుగురు యువకులని ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు విచారణ ప్రారంభించి అనుమానితులైన ఆ నలుగరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని దొంగతనం గురించి ప్రశ్నించగా.. ఆ వ్యాపారవేత్త గురించి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


వివరాల్లికి వెళితే.. తమిళనాడులోని తిరుప్పుూరు నగరంలో దురైస్వామి (56) అనే వ్యక్తికి బనియన్ తయారీ ఫ్యాక్టరీ, నూలు ఉత్తత్తి మిల్లులు ఉన్నాయి. అయితే ఇటీవల ఆయన ఇంట్లో నుంచి రూ.2.5 కోట్లు విలువ గల నగదు, బంగారు నగలు మాయమైనట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు నెలల క్రితం ఆయన కుమార్తె వివాహం జరిగిందని.. పెళ్లికి ముందు ఇంట్లో పెయింట్ వేయించానని.. ఆ పెయిటింగ్ వేయాడనికి వచ్చిన నలుగురు యువకులే ఈ దొంగతనం చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు.


దురైస్వామి ఇచ్చిన ఫిర్యదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పెయింటింగ్ పనులు చేసిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని.. డబ్బు, నగల గురించి ప్రశ్నించారు. అప్పుడు ఆ నలుగురు యువకులు పోలీసుల ముందు భయపడి నిజం చెప్పేశారు. తాము దురైస్వామి ఇంట్లో పెయింటింగ్ చేస్తుండగా.. ఒక రహస్య గది కనిపించిందని. ఆ గదిలో చిన్న చిన్న సంచుల్లో రూ.2 వేల నోట్లు మూటలుగా కట్టి దాచి ఉంచారని చెప్పారు. వాటిలో కొన్ని సంచులు చాటుగా తీసుకున్నామని వారు అంగీకరించారు. అయితే బంగారు నగల గురించి వారికేమీ తెలియదని అన్నారు.


పోలీసులు ఆ నలుగురు దొంగల నుంచి నగదు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే.. రూ.75 లక్షల విలువైన బంగారు నగలు ఎవరు దొంగతనం చేశారో.. అనే కోణంలో విచారన కొనసాగిస్తున్నారు.

Updated Date - 2022-04-29T06:00:56+05:30 IST